
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరగడం ప్రారంభించాయి. జూన్ 16వ తేదీ పసిడి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసి చూద్దాం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,843 పలుకుతున్నట్టు చూడవచ్చు. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
1,37,354 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 2,50,700 పలుకుతోంది. బంగారం ధర గడచిన వారం రోజులుగా భారీగా తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ రికవరీ దశలో ఉన్నట్లు చూడవచ్చు. దీంతో బంగారం ధర మళ్ళీ పెరుగుతోంది. ఒక దశలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
1.45 లక్షల కన్నా తక్కువకు పడిపోయినట్లు చూడవచ్చు. మళ్లీ ఇప్పుడు పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ విలువ తగ్గడమే కారణంగా చెప్పవచ్చు. అమెరికా ఇరాన్ మధ్యలో శాంతి ఒప్పందం పై వస్తున్నటువంటి వార్తలతో క్రూడాయిల్ ధరలు తగ్గాయి.
ఫలితంగా డాలర్ కు డిమాండ్ తగ్గి ధర క్షీణించింది. దీంతో మళ్లీ ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధర మళ్ళీ పెరగడం పెరుగుతున్న క్రమం ఇక్కడ చూడవచ్చు, అంతర్జాతీయ మార్కెట్లలో చూసినట్లయితే ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 4300 డాలర్లు పలుకుతోంది.
అదే సమయంలో వెండి ధర ఒక ఔన్స్ 70 డాలర్లు పలుకుతోంది. బంగారం వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండింటిలో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో
గోల్డ్ అలాగే సిల్వర్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సిల్వర్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య భారీగా పెరిగింది అని చూడవచ్చు. ప్రస్తుతం బంగారం అలాగే వెండి ధరలు మళ్ళీ పెరుగుదల బాట పట్టిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు ఇది ఒక రకంగా శుభవార్త గాని చెప్పవచ్చు.
కానీ రిటైల్ మార్కెట్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే వారికి మాత్రం పెరుగుతున్న ధరలు మళ్ళీ వారి జేబు పైన భారాన్ని పెంచుతున్నాయని చూడవచ్చు. అయితే బంగారం ధరలు తగ్గుతాయా లేదా అని ఆలోచించే వారికి మాత్రం అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి అని గుర్తించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగారం ధర డాలర్ పైన ఆధారపడి ఉంటుంది ఈ కారణంగానే తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతుంది అని చూడవచ్చు. ప్రస్తుతం బంగారం ధర రికవరీ దశలో ఉన్న నేపథ్యంలో స్వల్పకాలికంగా గమనించినట్లయితే బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే భారతదేశంలో ప్రస్తుతం పెళ్లిళ్లకు సీజన్ ఇంకా నడుస్తోంది, మరో నెల రోజుల్లో ఆషాడం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర తగ్గాలని చాలామంది ఆశపెట్టుకొని ఉన్నారు. కానీ అంతర్జాతీయ పరిణామాలు భవిష్యత్తులో ఎలా కొనసాగుతాయి అనేది తేలాల్సి ఉంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.