
UPSC Prelims 2026 Results: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – 2026 ఫలితాలు సోమవారం (జూన్ 15) రాత్రి వెలువడ్డాయి. ఈ పరీక్షలో ప్రతిభ చాటి, తదుపరి దశ అయిన ‘మెయిన్స్’ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 13,343 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
సివిల్స్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్ల జాబితాను కమిషన్ తన అధికారిక వెబ్సైట్ (upsc.gov.in) లో పొందుపరిచింది. ఈ ఏడాది మొత్తం 1,016 సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీ కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే మే 24న దేశవ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. కాగా, గతేడాది (2025లో) 1,087 ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టగా.. అప్పట్లో 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు. read also: Drogo Aerospace: భారత సైన్యానికి 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి దశకు వెళ్లడానికి విధిగా డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ (DAF-I) సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థులకు వచ్చిన వ్యక్తిగత మార్కులు, కేటగిరీల వారీగా కటాఫ్ వివరాలు మరియు ఆన్సర్ కీ (Answer Key)లను ఇప్పుడు ప్రకటించలేదు. సివిల్ సర్వీసెస్ 2026 తుది ఫలితాలు (Final Results) పూర్తిగా వెలువడిన తర్వాతే వీటిని యూపీఎస్సీ విడుదల చేస్తుంది.
అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే కమిషన్ ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 జూన్ 2026 గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Drogo Aerospace: భారత సైన్యానికి 41 అత్యాధునిక
‘జేకే 250ఈ’ డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ
Cockroach Janata Party: అభిజీత్ దిప్కేపై దాడి.. అసలు ఏం జరిగిందంటే?
Rajasthan storm: 70 కిమీ వేగంతో రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం
Cockroach Janata Party: జైపూర్‌లో ఉద్రిక్తత.. ‘కాక్రోచ్ పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై దాడి!
Perfect Health : నిత్య యవ్వనం, నిండు ఆరోగ్యం: ఉదయాన్నే చేయాల్సిన అలవాట్లు!
Minister Rammohan Naidu:భూములిచ్చిన రైతులకు రాయల్ గౌరవం.. జేవార్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ వారి కోసమే!