
అరంగేట్రంలో కాబోవెర్డె అద్భుత ప్రదర్శన టైటిల్ ఫేవరెట్ స్పెయిన్‌తో మ్యాచ్ డ్రా అట్లాంటా ఒకవైపేమో ప్రపంచ మేటి జట్లలో ఒకటి.. దానికి ప్రపంచకప్ గెలిచిన చరిత్ర ఉంది.. ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆ జట్టులో ఎటు చూసినా స్టార్లే.
ఇంకోవైపేమో ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న జట్టు.. ఆ దేశం పేరు కూడా అభిమానులకు పెద్దగా తెలియదు.. అందులో అందరూ అనామక ఆటగాళ్లే. ఇలాంటి రెండు జట్ల మధ్య పోరంటే.. ఫలితంపై ఎలాంటి అంచనా ఉంటుందో చెప్పేదేముంది? ఆ పెద్ద జట్టు.. ఈ చిన్న జట్టును ఎంత తేడాతో కొడుతుందనే చూస్తారంతా!
కానీ ప్రపంచకప్‌లో అరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న జట్టు.. అవతలున్న మేటి జట్టును నిలువరిస్తే? ప్రత్యర్థికి ఒక్క గోలూ ఇవ్వకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తే? ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఈ అనూహ్య ఫలితమే వచ్చింది సోమవారం. ఐరోపా దిగ్గజ జట్టు స్పెయిన్‌ను..
కాబోవెర్డె అనే పసికూన నిలువరించింది. ఫిఫా ప్రపంచకప్ 2026లో తొలి సంచలనం నమోదైంది. కేవలం 5 లక్షల జనాభా ఉన్న, తొలిసారి ఈ మెగా టోర్నీకి అర్హత సాధించిన కాబోవెర్డె.. మాజీ ఛాంపియన్ స్పెయిన్‌ను నిలువరించి ప్రకంపనలు రేపింది. కురసావ్ మీద జర్మనీలాగే, ప్రపంచకప్ అరంగేట్ర జట్టుపై గోల్స్ వర్షం కురిపించేస్తుందనుకున్న ఐరోపా ఛాంపియన్..
ఒక్కసారీ బంతిని నెట్లోకి పంపించలేకపోయింది. సోమవారం గ్రూప్-హెచ్లో కాబోవెర్డెతో ఆ జట్టు పోరు 0-0తో డ్రాగా ముగిసింది. మ్యాచ్‌లో ఎక్కువ శాతం (62) బంతిని తన అధీనంలోనే ఉంచుకున్నప్పటికీ గోల్ మాత్రం సాధించలేకపోయింది స్పెయిన్.
ఆ జట్టు 27 సార్లు గోల్ ప్రయత్నాలు చేయగా.. ప్రత్యర్థి ఆరుసార్లే ప్రయత్నించింది. ఈ మ్యాచ్‌లో హీరో కాబోవెర్డె గోల్ కీపర్ వోజినానే. స్పెయిన్ ఆటగాళ్లు నేరుగా ఏడుసార్లు నెట్‌ను లక్ష్యంగా షాట్లు ఆడగా.. అందులో చాలా వాటిని అతను అద్భుతంగా అడ్డుకున్నాడు.
కలిసి రాలేదు. 39వ నిమిషంలో టోరెస్ ఆరు గజాల దూరం నుంచి కొట్టిన షాట్ గోల్ బార్‌ను తాకి వెనక్కి వెళ్లగా.. రీబౌండ్ షాట్‌ను వోజినా అడ్డుకున్నాడు. 45వ నిమిషంలోనూ టోరెస్ కొట్టిన షాట్‌ను వోజినా గొప్పగా ఆపాడు. ఇంజురీ టైంలోనూ అతను మరో సేవ్ చేశాడు. 70వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన స్పెయిన్ కొత్త సూపర్ స్టార్ యమాల్ మూడు నిమిషాలకే గోల్ ప్రయత్నం చేసినా కాబోవెర్డె గోల్ కీపర్ బంతిని నెట్లోకి పోనివ్వలేదు. ఇంకా మరి కొన్ని స్పెయిన్ ప్రయత్నాలను వోజినా అడ్డుకోగా.. కొన్ని గురి తప్పాయి. మ్యాచ్‌లో డిఫెన్స్ మీదే దృష్టిపెట్టిన కాబోవెర్డె పెద్దగా ఎటాక్ చేయలేదు. స్పెయిన్ నెట్కేసి ఆ జట్టు ఒక్క షాటే కొట్టింది. ప్రపంచకప్‌లో స్పెయిన్ గోల్ కొట్టకుండా అత్యధిక ప్రయత్నాలు చేసిన మ్యాచ్‌గా ఇది రికార్డును సమం చేసింది. 1966లో పరాగ్వేతో మ్యాచ్‌లోనూ 27 ప్రయత్నాలు చేసినా గోల్ నమోదు కాలేదు. ఆ మ్యాచ్ కూడా 0-0తో డ్రాగా ముగిసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మొత్తంగా కాబోవెర్డె తిరుగులేని డిఫెన్స్ స్పెయిన్‌కు చెక్ పెట్టింది. కొన్నిసార్లు స్పెయిన్‌కు అదృష్టం కూడా