
మైసూరు, న్యూస్టుడే: కర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్టీనగరలో ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే మంటలు పబ్ మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సాహిన్, ప్రకాశ్ అనే ఇద్దరు కార్మికులు సజీవ దహనమయ్యారు.
మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ఘటన సమయంలో పబ్లో పాతిక మందికి పైగా ఉన్నారు. ప్రమాదానికి కారణాన్ని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ప్రమాదం సంభవించినప్పుడు బయట పడేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం, పైకప్పును రెల్లు గడ్డితో కప్పి ఉంచడం, మద్యం సీసాలు పగిలి మంటలు వేగంగా వ్యాపించడంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపకదళ విభాగం అధికారి రంగనాథ్ తెలిపారు.
వంట గదిలో ఉన్న ఇద్దరు తాము కాపాడేలోగా మరణించారని చెప్పారు. 15 మందిని తాము రక్షించామని వివరించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.