
సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాజస్థాన్ దొంగల ముఠా బీభత్సం దొంగలు పారిపోతూ పొలాల్లో వదిలేసిన బ్యాగులు బాపట్ల, న్యూస్‌టుడే: తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బాపట్ల జిల్లాలోని బాపట్ల-అప్పికట్ల మధ్య నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో రాజస్థాన్‌కు చెందిన దొంగల ముఠా సోమవారం వేకువజామున 1.12 గంటలకు చోరీకి పాల్పడింది.
ఈ ముఠా అంతకుముందు నెల్లూరు స్టేషన్లో రైలు ఎక్కింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఎస్-3 బోగీలో కాకినాడకు చెందిన ప్రయాణికురాలు వి.కనకదుర్గాదేవికి చెందిన 45 గ్రాముల బంగారు గొలుసు, ఎస్-6 బోగీలో రాజమహేంద్రవరానికి చెందిన పి.మీనాక్షి నుంచి 30 గ్రాముల బంగారు గొలుసును దొంగలు లాక్కెళ్లారు.
మరికొందరి నుంచి కూడా దోచుకున్నారు. బాధిత మహిళలు కేకలు వేయడంతో బోగీల్లో ఉన్న ఇతర ప్రయాణికులు అప్రమత్తమై ప్రతిఘటించారు. జనరల్ బోగీల్లో ఉన్న మరికొందరు దొంగలు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా..
వారిపై రాళ్లు రువ్వుతూ పరారయ్యారు. రైలులో దోపిడీ చేసి పారిపోతున్న దొంగలపై ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరిపారు. చీకట్లో కాల్పులు జరపటంతో దుండగులకు గాయాలు కాలేదు. ఈ ఘటనతో 16 నిమిషాల పాటు ఆగిన సర్కార్ ఎక్స్‌ప్రెస్..
తిరిగి బయలుదేరి గుంటూరు వెళ్లింది. తెనాలి, విజయవాడ రైల్వే స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ఆభరణాల విలువ రూ.11.25 లక్షలని రైల్వే పోలీసులు తెలిపారు. ఆరుగురున్న దొంగల ముఠా ఈ ఘటనలో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.
దొంగలు పారిపోతూ వదిలివెళ్లిన రెండు సంచులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని ఆర్పీఎఫ్ ఎస్పీ షణ్ముఖ్ వడివేల్, బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్లు వేర్వేరుగా పరిశీలించారు. దొంగలను పట్టుకోవడానికి పది బృందాలను నియమించినట్లు తెలిపారు.
పోలీసులు పట్టుకొని విచారిస్తున్నారు. మిగిలిన ఐదుగురి కోసం గాలిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
ముఠా సభ్యుడు సోనూను ఉదయం జీఆర్పీ, ఆర్పీఎఫ్