ఆరోగ్యకరమైన పనీర్, స్ప్రౌట్స్ రాప్.. మనం రోజువారీ ఉపయోగించే పదార్థాలతో సులభంగా ప్రిపేర్ చేసుకోగలిగే ఒక సమతుల్యమైన ఆహారం. దీనిని తయారు చేయడం మాత్రమే కాదు.. ఎక్కడికైనా తీసుకెళ్లడానికి కూడా చాలా తేలికగా ఉంటుంది. అధిక ప్రోటీన్ ఉండే ఈ స్ప్రౌట్స్ రాప్ వెరైటీ ఫుడ్స్ ఇష్టపడే వారి వాచ్ లిస్ట్‌లో ఉంటుంది.
బిజీగా ఉండే వర్కింగ్ డేస్‌లో టైమ్ సేవ్ చేసుకోవడానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలనే లక్ష్యాలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్. ఇందులో ఉపయోగించే గింజలను మొలకెత్తించడం వల్ల వాటిలో పోషక విలువలు బాగా పెరగడమే కాకుండా తినేటప్పుడు మంచి క్రంచీ అనుభూతిని ఇస్తాయి.
రకరకాల మొలకలు జీర్ణక్రియకు తోడ్పడే ప్లాంట్ ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, సహజ ఎంజైములను అందిస్తాయని జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్ (JFF) అధ్యయనం పేర్కొంది. మరోవైపు పనీర్ ఎముకలు, కండరాల బలానికి అవసరమైన నాణ్యమైన ప్రోటీన్, కాల్షియంను సమకూరుస్తుందని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది.ఇక దీనిలో వాడే దోసకాయ, క్కారెట్, ఉల్లిపాయలు, క్యాప్సికమ్ వంటి తాజా కూరగాయలు శరీరానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, తగినంత నీటి శాతం అందిస్తాయి.
ఇవన్నీ ఈ హెల్తీ ఇండియన్ లంచ్ బాక్స్ రాప్స్ను ఎంతో పౌష్టికంగా, రీఫ్రెషింగ్‌గా మారుస్తాయి. ఈ రాప్‌ను రకరకాల స్ప్రౌట్స్, పనీర్, తాజా కూరగాయలను కలిపి పుదీనా చట్నీ లేదా తేలికపాటి పెరుగు స్ప్రెడ్‌తో పాటు గోధుమ రోటీలో రోల్ చేసి తయారు చేస్తారు.
పనీర్ అనేది ప్రోటీన్, కాల్షియంలను కలిగి ఉండే గొప్ప వనరు. ఇది భోజనానికి అదనపు పోషకాలను యాడ్ చేస్తుంది. పనీర్‌ను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు, కండరాలు దృఢంగా మారడమే కాకుండా కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
ఎంతో సులభంగా, త్వరగా తయారు చేసుకోగలిగే ఈ వంటకం, మీ ఆఫీస్ లంచ్ బాక్స్ తప్పనిసరిగా ప్రయత్నించదగిన ఒక బెస్ట్ ఆప్షన్. స్ట్రీట్ స్టైల్ రాప్స్లో సాధారణంగా మైదా
పిండితో చేసిన రొట్టెలు, ఎక్కువ ఆయిల్, క్రీమీ సాస్‌లు, ప్రాసెస్ చేసిన పదార్థాలను వాడుతుంటారు. కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు హెల్తీ పనీర్, మిక్డ్స్ స్ప్రౌట్స్ రాప్‌లో గోధుమ రోటీ, తాజా పనీర్, స్ప్రౌట్స్, కూరగాయలను ఉపయోగించడం వల్ల బాడీకి ఎక్కువ ప్రోటీన్, ఫైబర్, సమతుల్యమైన పోషకాలు అందుతాయి. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ తాజా పదార్థాలు తేలికపాటి రుచులతో కూడా ఉంటాయి. ఇది ఆఫీస్‌లో మధ్యాహ్న భోజనాన్ని ఎంతో రుచికరంగా, తృప్తిగా మార్చడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఛాయిస్. తయారీకి కావాల్సిన పదార్థాలు 2 లేదా 3 గోధుమ రోటీలు 1 కప్పు ఆవిరిపై ఉడికించిన మొలకలు 150 గ్రాముల పనీర్ (బాగా స్మాష్ చేసి) అర కప్పు దోసకాయ ముక్కలు అర కప్పు బాగా తురిమిన క్యారెట్ అర కప్పు క్యాప్సికమ్ ముక్కలు 1 ఉల్లిపాయ బాగా చిన్నగా కట్ చేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల పుదీనా చట్నీ 2 టేబుల్ స్పూన్ల గట్టి పెరుగు 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా కొంచెం నిమ్మరసం, సరిపడినంత ఉప్పు, కొత్తిమీర తరుగుతయారీ విధానంమొదట స్ప్రౌట్స్‌ను మెత్తబడే వరకు ఆవిరిపై ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఉడికించిన మొలకలు, పనీర్ తరుగు, దోసకాయ ముక్కలు, తురిమిన క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి వేయించిన జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు, నిమ్మరసం యాడ్ చేయాలి. చివరల్లో కొత్తిమీర తరగు వేసి మసాలాలన్నీ బాగా పట్టేలా కలపాలి. తర్వాత గోధుమ రొట్టెపై పుదీనా చట్నీ, గట్టి పెరుగు సమానంగా రాయాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న మొలకలు, పనీర్ మిశ్రమాన్ని ప్రతి రొట్టె మధ్యలో సమానంగా పెట్టాలి. లోపల పెట్టిన మిశ్రమం బయటకు రాకుండా రొట్టె ఇరువైపులా మడుస్తూ గట్టిగా రోల్ చేయాలి. అవసరమైతే ఈ ర్యాప్‌ను పెనంపై ఒకటి లేదా రెండు నిమిషాలు లైట్‌గా హీట్ చేసుకోవచ్చు. అంతే ర్యాప్స్ వెంటనే సర్వ్ చేసుకోవచ్చు. లేదా ఆఫీస్ లంచ్ బాక్స్ కోసం ప్యాక్ చేసుకోవచ్చు. ముఖ్య గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించడం, పాటించకపోవడం పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.