
కిలో రూ.1,200 ఒక్కో రైతుకు 250 గ్రాములు మాత్రమే ఈనాడు, అమరావతి: అధిక దిగుబడినిస్తూ, తెగుళ్లను తట్టుకునే ఎల్సీఏ 643, ఎల్సీఏ 625 రకాల మిరప విత్తనాలను గుంటూరులోని లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానంలో రైతులకు విక్రయిస్తున్నామని కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ టి.సుశీల తెలిపారు. మంగళవారం నుంచి రైతులు నేరుగా వచ్చి విత్తనాలు తీసుకోవచ్చని సూచించారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు విత్తనాలు విక్రయిస్తారు. (రెండో శనివారం, ఆదివారం సెలవు.) కిలో విత్తన ధర రూ.1,200 గా నిర్ణయించారు. ఒక్కో రైతుకు 250 గ్రాములు మాత్రమే ఇస్తారు. వివరాలకు 99898 09554 / 94405 92982 నంబర్లలో సంప్రదించవచ్చని ఆమె సూచించారు.
పచ్చి మిరప, ఎండు మిరప సాగుకు అనువైన రకం. మిరప కాయలు లేత ఆకుపచ్చ రంగులో 13-14 సెంటీమీటర్ల పొడవుతో ఉంటాయి. ఎండిన తర్వాత కొంచెం ముడతతో బ్యాడగి రకంలా కన్పిస్తాయి. బెట్ట తట్టుకుంటుంది, కొంతవరకు జెమిని వైరస్ను కూడా తట్టుకోగలదు.
కొద్దిపాటి పురుగుమందుల పిచికారితో నల్లతామర పురుగు ఉద్ధృతిని తగ్గించవచ్చు. ఎండు మిరప సాగుకు అనువైనది. కొమ్మలు బలంగా, ఎత్తుగా పెరుగుతాయి. కణుపులు దగ్గరగా.. కాపు చిక్కగా ఉంటుంది. నేరుగా ఎద పెట్టడానికి అనువైన రకం. కాయలు సన్నగా..
8-10 సెంటీమీటర్ల మధ్యస్థ పొడవుతో తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చి కాయ ముదురు ఆకుపచ్చగా ఉంటుంది. సూటి రకాలలో అధిక ఘాటు (45,000-50,000 ఎస్.హెచ్.యు.).. ఆకర్షణీయమైన ఎరుపు రంగు (60-65 ఎ.ఎస్.టి.ఏ.)తో ఉంటుంది. తోలు పలచగా ఉంటుంది.
కాయకుళ్లు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. తాలు కాయలు తక్కువ. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు