
ఈ కేసు నుంచి ఎవరూ తప్పించుకోలేరు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈనాడు, అమరావతి: ‘‘వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణం దేశంలోనే అతి పెద్దది. దర్యాప్తు అంతిమ లబ్ధిదారు వరకూ చేరుతుంది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన వారెవరినీ వదిలిపెట్టేది లేదు’’ అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్సైజ్ శాఖ పురోగతిపై రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్ పాలనలో మద్యం కుంభకోణం ద్వారా రూ.3,112 కోట్లు దోచుకున్నారని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక శ్వేతపత్రంలో వెల్లడించాం.
సిట్ దర్యాప్తులోనూ రూ.3,500 కోట్లకు పైగా కొల్లగొట్టారని తేలింది. ఈ కేసులో 52 మంది నిందితుల్ని గుర్తించారు. 17 మందిని అరెస్టు చేశారు. రూ.260 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. రూ.20 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు’’ అని వివరించారు.
ప్రభుత్వంపై బురదచల్లాలనే కుట్రతో ఆ పార్టీ నేతలు జోగి రమేష్, ఆయన సోదరుడు రాము ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించినట్లు తేలిందని పేర్కొన్నారు.ప్రధానాంశాలివి.. మద్యపాన నిషేధం అమలు చేస్తామనే హామీతో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్..
చివరకు అస్తవ్యస్త విధానాన్ని తెచ్చి, మద్యం ధరలు 75% పెంచేశారు. ఫలితంగా సుంకం చెల్లించని మద్యం రాష్ట్రంలోకి భారీగా వచ్చేసింది. వారి ఐదేళ్ల పాలనలో రూ.18,860 కోట్ల మేర ఆదాయం కోల్పోయాం. సొంత పార్టీ నేతలకు ప్రభుత్వ దుకాణాలు అప్పగించి, వాటిలో నాటి ప్రభుత్వ పెద్దల సొంత బ్రాండ్లు మాత్రమే అమ్మేలా చేశారు.
లీలా, అదాన్ వంటి కొత్త కంపెనీల బ్రాండ్లకు చెందినవే రూ.20,356 కోట్ల విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలోని 20 డిస్టలరీల్లో 60% ఉత్పత్తి సామర్థ్యాన్ని తమ పరం చేసుకున్నారు. డిజిటల్ చెల్లింపులకు అంగీకరించలేదు. రూ.99,411 కోట్ల విక్రయాలు నగదు రూపంలోనే చేశారు.
పాడయ్యాయి. 40 వేల మంది మహిళలు వితంతువులు అయ్యారు. ఈ ఉసురు అంతా గత ప్రభుత్వానిదే.
కూటమి ప్రభుత్వ ఏర్పాటైన వెంటనే పారదర్శకతతో కూడిన నూతన మద్యం విధానం తీసుకొచ్చాం. దరఖాస్తు రుసుముల రూపంలో రూ.19 వేల కోట్లు ఆదాయం వచ్చింది. మద్యం నాణ్యత పరీక్షల కోసం 4 ప్రాంతాల్లో ల్యాబ్లు పెట్టి 13 రకాల పరీక్షలు చేయిస్తున్నాం. పర్యాటకానికి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనే బీచ్షాక్స్ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఇవి మిగతా రాష్ట్రాల్లోనూ ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
కల్తీ మద్యం తాగి అనేక మంది కిడ్నీలు