
39 ఏళ్లకే చాలా జీవితాన్ని చూశానంటోంది సమంత (Samantha). తను అనుభవించిన కష్టాలు, నష్టాలన్నీ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటివని, అవన్నీ కలిపి చూసుకుంటే, ఎంతో నేర్చుకున్నాననే ఫీలింగ్ వచ్చిందంటోంది. “చాలామందికి వాళ్లు అనుభవించిన స్ట్రగుల్ బయటకు కనిపించకపోవచ్చు.
కానీ నా లైఫ్, నా కష్టాలు, నా జీవితం ఓ తెరిచిన పుస్తకం. నా గురించి, నా బాధల గురించి ప్రజలందరికీ తెలుసు. చాలామంది నా జీవితాన్ని జడ్జ్ చేశారు, రివ్యూ చేశారు, పోస్టుమార్టం కూడా చేశారు. అదంతా తీసుకోవడం చాలా కష్టమైంది. అదే టైమ్ లో వాటన్నింటి వల్ల నేను జీవితాన్ని చూశాను.
జీవితంలో ఎంతో అనుభవించి, ఇంకెంతో నేర్చుకున్నాను.” తన కెరీర్ కు ఈ జీవితానుభవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతోంది సమంత. ఓ సీన్ లో నటించేటప్పుడు, తన వ్యక్తిగత అనుభవాలు బాగా హెల్ప్ అవుతున్నాయని, జీవితంలో సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నానని అంటోంది.
“ఒకప్పుడు పేపర్ చూసి నటించేదాన్ని. కానీ ఇప్పుడు ఓ సీన్ లో నటించేటప్పుడు నా జీవితంలో పొందిన అనుభూతుల నుంచి నటించగలుగుతున్నాను. నటన నా మనసులోంచి వస్తోందిప్పుడు. ఏదైనా విషయాన్ని ఎక్కువగా అనుభూతి చెందుతున్నాను. అలా నా జీవితానుభవాల్ని నా కెరీర్ కోసం ఉపయోగిస్తున్నాను.
కేవలం నటన మాత్రమే కాదు, లైఫ్ లో నేను తీసుకునే నిర్ణయాలకు నా జీవితానుభవాలు ఉపయోగపడుతున్నాయి.” లాంగ్ గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది సమంత. ఆమె భర్త రాజ్ నిడిమోరు క్రియేషన్ లో, నందనీ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది
.