
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెర పడింది. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ వారం చివర్లో దీనిపై సంతకాలు జరగనున్నాయి. మూడు నెలలకు పైగా సాగిన యుద్ధం ముగిసిపోవడంతో భారత్ సహా ప్రపంచదేశాలు హర్షం వ్యక్తంచేశాయి.
ఈ ఒప్పందాన్ని (US-Iran deal) స్వాగతిస్తూ.. పశ్చిమాసియాలో సుస్థిర శాంతి నెలకొనాలని ఆకాంక్షించాయి. ‘‘అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఈ డీల్‌తో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz:)లో ఇకపై నౌకల రవాణా నిరాటంకంగా, స్వేచ్ఛగా జరుగుతుందని ఆశిస్తున్నాం.
శాంతి, ప్రాంతీయ స్థిరత్వం కోసం చేపట్టే అన్ని చర్యలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుంది. ఈ పరిణామాలను స్ఫూర్తిగా తీసుకుని ఉక్రెయిన్-రష్యా కూడా శాంతి ప్రయత్నాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని మంత్రిత్వ శాఖల అంతర్గత సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్ వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.