సామాజిక మాధ్యమాల్లో కేవలం ఒక్క నిమిషం గడుపుదామని ఫోన్ చేతిలోకి తీసుకున్నప్పటికీ, తెలియకుండానే గంటల తరబడి స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోతున్నారా? నేటి కాలంలో ఇది చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ అనుభవమే. అయితే, దీని వెనుక మానవ మెదడును ప్రభావితం చేసే లోతైన సైన్స్ దాగి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
అంతులేకుండా సాగే ఈ స్క్రోలింగ్ అలవాటు మన ఏకాగ్రతను, మెదడులోని 'రివార్డ్ సిస్టమ్'ను ఏ విధంగా మార్చివేస్తోందో తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.సోషల్ మీడియా ఫీడ్లు సాధారణంగా పుస్తకాలు లేదా సినిమాల మాదిరిగా నిర్దిష్ట ముగింపు లేకుండా, నిరంతరం కొనసాగేలా రూపొందించబడ్డాయి. ఇది 'తదుపరి అంశం ఏమిటి?' అనే ఉత్సుకతను వినియోగదారుల్లో నిరంతరం రేకెత్తిస్తాయి.
మానసిక నిపుణులు ఈ స్థితిని 'స్లాట్ మెషిన్' అనుభవంతో పోలుస్తున్నారు. స్లాట్ మెషిన్లో ఎప్పుడు జాక్‌పాట్ వస్తుందో తెలియని ఆశతో ఎలాగైతే ప్లేయర్లు ఆకర్షితులవుతారో, సోషల్ మీడియాలో కూడా మనకు నచ్చే పోస్ట్ లేదా వీడియో ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి మనల్ని స్క్రోలింగ్ చేస్తూనే ఉండేలా ప్రేరేపిస్తుంది.ప్రతీ స్వైప్‌కు మెదడులో 'డోపమైన్' అనే రసాయనం స్వల్ప మోతాదులో విడుదల అవుతుంది.
ఇది కేవలం సంతోషాన్ని మాత్రమే కాకుండా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ప్రేరణను, తీవ్రమైన ఆసక్తిని కలిగిస్తుంది. ఈ డోపమైన్ విడుదల కోసం మన మెదడు పదేపదే స్క్రోలింగ్ చేసేలా మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ ప్రక్రియ కాలక్రమేణా ఒక వ్యసనపూరిత అలవాటుగా మారిపోతుంది.వేగవంతమైన కంటెంట్‌ను నిరంతరం వీక్షించడం వల్ల మెదడు సహజత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.
దీనివల్ల