
అమరావతి (Amaravati) రాజధానిలోని సచివాలయం, అసెంబ్లీ, వివిధ విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇవాళ ప్రభుత్వం (AP Govt) మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణం నేపథ్యంలో వీరికి గతంలో ఇచ్చిన ఓ వెసులుబాటును కొనసాగిస్తూ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
గత కొన్నేళ్లుగా ఈ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.అమరావతి ఎయిర్ పోర్ట్ రాకతో గన్నవరం క్లోజ్ ? సర్కార్ క్లారిటీ..!2016లో అమరావతి రాజధాని ప్రకటన తర్వాత ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం అమల్లోకి వచ్చింది.
అప్పట్లో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చేందుకు ఉద్యోగులు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ విధానం అమల్లోకి తెచ్చి వెసులుబాటు కల్పించారు. దీంతో హైదరాబాద్ లో పిల్లలు, కుటుంబాలు కలిగిన ఉద్యోగులు సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే పని చేసి తిరిగి వెళ్లిపోయేవారు.
AP IIIT Merit List 2026: ఏపీ ట్రిపుల్ ఐటీ మెరిట్ లిస్ట్..! ఇలా చెక్ చేసుకోండి..!అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని నిర్మాణం ముందుకెళ్లకపోయినా ఉద్యోగులకు ఈ ఐదు రోజుల పని విధానం మాత్రం కొనసాగించారు. అలా ఐదేళ్ల పాటు ఉద్యోగులు హైదరాబాద్ నుంచి సోమవారం రావడం, శుక్రవారం వరకూ పనిచేసి వెళ్లిపోవడం కొనసాగించేవారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వారికి ఈ ఐదు రోజుల పని విధానం అలా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా తాజాగా మరో ఏడాది పాటు పొడిగింపు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు సచివాలయం, శాఖాధిపతుల కార్యలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులకు వర్తింపచేస్తారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5:30 వరకు పని వేళలు కూడా కొనసాగుతాయి
.