
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Anirudh New Chapter Aravind: సంగీత దర్శకుడు అనిరుథ్ తమిళంతో పాటు తెలుగులో తన సంగీతంతో ప్రేక్షకులను అలరించాడు.
తాజాగా ఈయన తన సొంత ఇండిపెండెంట్ లేబుల్ అల్బుకర్కీ రికార్డ్స్‌తో పాటు యూనివర్సల్ మ్యూజిక్ ఇండియాతో కలిసి ‘అరవింద్’ అనే ప్రైవేట్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ కాంబోలో రిలీజైన ఫస్ట్ పాట ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒరిజినల్ పాప్, హిప్ హాప్ ఆధారంగా రూపొందిన ఈ ట్రాక్‌తో అనిరుద్ తన మ్యూజిక్ వరల్డ్‌ను దాటి కొత్త ఆధ్యాయాన్ని ప్రారంభించారు.
2012లో విడుదలైన వైరల్ హిట్ ‘వై దిస్ కొలవెరి డి’ ద్వారా అనిరుద్ దేశవ్యాప్తంగా పాపులారిటీ పొందాడు. ఆ తర్వాత దక్షిణాదిన జైలర్, కూలీ, విక్రమ్, లియో, దేవర పార్ట్ వన్ వంటి పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
అలాగే 2023లో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కూడా సంగీత దర్శకుడిగా అక్కడ తన సత్తా చాటాడు. అనిరుద్..చాలా ఏళ్ల కష్టంతో చిన్న స్థాయి నుంచి అసాధారణ స్థాయికి ఎదిగాడు. అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా రాక్‌స్టార్ అనే బిరుదుని పొందాడు.
ఇక అరవింద్ పాట విషయానికి వస్తే.. వేగంగా మారుతోన్న డిజిటల్ సంగీత ప్రపంచంలో తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకోవడానికి ఓ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ పడే కష్టాలను ఇందులో ఆవిష్కరించారు అనిరుథ్. ఈ పాట కథలో కేంద్రంగా నిలిచే క్యారెక్టర్ పేరు
అరవింద్. అనిరుధ్ తన తరహా పాత్రకే ఈ పేరు పెట్టుకున్నాడు. ఈగో, ఎన్నో ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా, సంగీతంపై ఉన్న ప్యాషన్‌తో తన జీవితాన్ని పూర్తిగా దానికి అంకితం చేసిన యువ సంగీతకారుడే అరవింద్. ఇప్పటి డిజిటల్ యుగంలో పాటలను విడుదల చేయటం చాలా సులభమైపోయింది. అయితే దక్షిణ భారత సినీ రంగంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా ప్రతిభను నిరూపించుకుంటూ కెరీర్‌ను కొనసాగించడం మాత్రం అంత సులువైన విషయం కాదు. అయినప్పటికీ ఏదో ఒక రోజు తన సంగీతం ప్రేక్షకులను చేరుకుంటుందనే నమ్మకంతో అరవింద్ ముందుకు సాగుతుంటాడు.
ఈ సందర్బంగా అనిరుద్ మాట్లాడుతూ ‘‘‘అరవింద్’ అంటే ప్రతి ఒక్కరిలో ఉండే ఓ తరహా వ్యక్తిత్వమే. మన అందరి జీవితాల్లో ఓ అరవింద్ ఉంటాడన్నాడు. అయితే తన ప్రతిభను చూపించడానికి ఒక్క అవకాశం కోసం ఎదురుచూస్తోన్న ఓ స్వతంత్ర కళాకారుడి కథను ఈ పాట చెబుతుందన్నారు. అలాగే నేటి డిజిటల్ ప్రపంచంలో ఉన్న విపరీతమైన పోటీలో పెద్ద స్థాయికి చేరుకునే సమయంలో ఒక ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ఎదుర్కొనే సవాళ్లను ఈ పాటలో చూడొచ్చున్నారు.
ఈ పాటకు అనిరుధ్ పర్సనల్ లైఫ్‌కు సంబంధం ఉంది. తను కూడా జీవితంలో ఒకప్పుడు అరవింద్ వంటి దశను ఎదుర్కొన్నవాడే అని తెలిపాడు. ఈ పాట ద్వారా ఇలాంటి ప్రయాణంలో ఉన్న ఇతర కళాకారులు, క్రియేటివ్ వ్యక్తులతో అనుబంధం ఏర్పరచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. అలాగే తన ఎదుగుదలతో పాటు ఎదురైన సవాళ్లు ఈ సాంగ్‌లో చూపించబోతున్నాడు. అల్బుకర్కీ రికార్డ్స్ ద్వారా రాబోయే రోజుల్లో ప్రైవేట్ ఆల్బమ్ పాటలకు అనిరుద్ సిద్ధమవుతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.