
Washing Rice Before Cooking: భారతీయ ఇళ్లలో అన్నం వండటానికి ముందు బియ్యాన్ని కడగడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక సాధారణ అలవాటు. అయితే, ఇలా చేయడం వల్ల లాభాలు ఉన్నాయా లేక నష్టాలు జరుగుతున్నాయా అనే అంశంపై ఆహార నిపుణులు మరియు శాస్త్రవేత్తలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
బియ్యాన్ని కడగడం వల్ల అన్నం ముద్దగా కాకుండా పొడిపొడిగా రావడంతో పాటు, రసాయన కాలుష్య కారకాలు తొలగిపోతాయని.. అదే సమయంలో కొన్ని రకాల పోషకాలు నష్టపోయే ఛాన్స్ కూడా ఉందని వారు పేర్కొంటున్నారు. Read also: Immunity : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినాల్సిందే !!
ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ అడిలైడ్ యూనివర్సిటీకి చెందిన ఆహార శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. బియ్యం కడగడం వల్ల దానిపై ఉండే అదనపు పిండి పదార్థం (స్టార్చ్) తొలగిపోతుంది. దీనివల్ల అన్నం వండినప్పుడు గింజలు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి.
దీనితో పాటు, పంట సాగు సమయంలో నీరు మరియు నేల ద్వారా బియ్యానికి చేరే ‘ఆర్సెనిక్’ వంటి ప్రమాదకర రసాయనాలు కడగడం వల్ల చాలా వరకు శుభ్రపడతాయని ప్రముఖ ఫుడ్ సైంటిస్ట్ పర్మల్ డియో తెలిపారు. 2021లో జరిగిన ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, వండటానికి ముందు బియ్యాన్ని కడగడం వల్ల అందులో ఉండే మైక్రోప్లాస్టిక్స్ (సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు) 20 నుండి 40 శాతం వరకు తగ్గుతాయని రుజువైంది.
అయితే, బియ్యాన్ని ఎక్కువగా నానబెట్టి, పదే పదే కడగడం వల్ల అందులో ఉండే ఐరన్, కాపర్, జింక్ వంటి నీటిలో కరిగే కొన్ని ముఖ్యమైన ఖనిజ లవణాలు (Minerals) నష్టపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాకపోతే, రోజువారీ జీవితంలో సమతుల్య ఆహారం (Balanced Diet) తీసుకునే వారికి ఈ చిన్నపాటి పోషకాల నష్టం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని డైటీషియన్ ఇవాంజెలిన్ మాంట్జియోరిస్ స్పష్టం చేశారు.
ఇప్పటికే మిల్లుల్లో శుద్ధి అయ్యి వస్తుండటం వల్ల.. కేవలం రుచి మరియు పైన ఉండే ధూళి, కెమికల్స్ వదిలించుకోవడానికే కడగాల్సి ఉంటుందని శాస్త్రవేత్త బో వాంగ్ వివరించారు.
ఆహార శాస్త్రవేత్తల సలహా ప్రకారం.. బియ్యంలోని పోషకాలు పోకుండా ఉండాలంటే ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సున్నితంగా కడగడం మంచిది. ఇలా చేయడం వల్ల పోషకాల నష్టం చాలా స్వల్పంగా ఉంటుంది.
ఒకవేళ మీరు వండే బియ్యంలో ఆర్సెనిక్ లేదా పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన ఉంటే.. బియ్యాన్ని కడిగిన తర్వాత ఎక్కువ నీరు పోసి ఉడికించి, గంజిని వార్చివేయడం (Drain method) ఉత్తమమైన మార్గం. ఈ పద్ధతి ద్వారా బియ్యంలోని ఆర్సెనిక్ శాతాన్ని దాదాపు 40 నుండి 60 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధనల్లో తేలింది.
Drogo Aerospace: భారత సైన్యానికి 41 అత్యాధునిక ‘జేకే 250ఈ’ డ్రోన్లను అందించిన హైదరాబాద్ సంస్థ
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Immunity : వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి తినాల్సిందే !!
Curry Leaves Benefits: కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య లాభాలు
Children Vaccine : పిల్లల టీకాల ధరలు పెంపు
Blood Donation Benefits: రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Neem Fruits: వేప పండ్లు తింటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Cancer drug prices: పెరిగిన కీమోథెరపీ మందుల ధరలు
ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న బియ్యం