రాచనగరి మైసూరులో సోమవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ పబ్‌లో కిచెన్‌లో మంటలు చెలరేగి.. ఇద్దరు సజీవదహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పబ్ యజమాని కూడా ఉన్నారు. మృతులను డార్జిలింగ్‌కు చెందిన 26 ఏళ్ల సాహిన్, నేపాల్‌కు చెందిన 24 ఏళ్ల ప్రకాశ్‌గా గుర్తించారు.
గాయపడినవారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పబ్ యజమాని ప్రీతమ్ పునీత్‌తో పాటు కస్టమర్లు సోను, రమేశ్, మహాదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్‌లు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందని చెప్పారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పది ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపుచేస్తూ.. లోపలి చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నం చేశారు.
15 మంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన సహాయక సిబ్బంది.. గాయపడినవారికి చికిత్స కోసం తరలించారు.మైసూరు రింగ్ రోడ్డు సమీపంలోని ఫాక్స్ డెన్ లిక్కర్ గ్యారేజ్ బార్ అండ్ రెస్టారెంట్లో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం సంభవించింది. పైఅంతస్తులో మంటలు చెలరేగి..
క్షణాల్లో వ్యాపించాయి. దీంతో ఫ్లోర్ మొత్తం కాలిబూడిదయ్యింది. ప్రమాద సమయానికి లోపలి 25 మందికిపైగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక నివేదిక ప్రకారం గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. క్షతగాత్రులకు సయోగ్, అపోలో ఆసుపత్రుల్లో చికిత్స కొనసాగుతోంది.
అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది.ప్రమాద సమయానికి 25కిపైగా లోపలి ఉన్నారని, దట్టమైన పొగ మొత్తం కమ్మేయడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. పొగ కారణంగా బయటకు వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో లోపల ఉన్నవారిలో భయాందోళనలు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో అతికష్టంతో మంటలను ఆర్పేశారు.
తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో కొందరు భవనం పై అంతస్తు నుంచి దూకడంతో గాయాలయ్యాయని సమాచారం. మంటలను అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. మంటలు సమీపంలోని భవనాలకు