పాలకూర, లెట్యూస్ వంటి ఆకుకూరల్లో అన్ని రకాల విటమిన్లతో పాటుగా విటమిన్ బి9 లభిస్తుందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రిపోర్ట్ తెలిపింది. అరకప్పు వండిన పాలకూరలో 131 మిల్లీగ్రాముల ఫోలేట్ లభిస్తుంది. చిక్కుళ్లలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.
ఒక కప్పు వండిన బీన్స్‌లో 131 మిల్లీగ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. చిక్కుళ్లు తింటే ఐరన్, మెగ్నీషియం, పొటాషియం కూడా బాగా అందుతుంది. అవకాడోలు రుచికరంగా ఉంటాయి. ఒక కప్పు పచ్చి అవకాడోలో సుమారులో 59 మిల్లీగ్రాముల ఫోలేట్ లభిస్తుంది.
గుడ్లు తింటే ఫోలేట్ లోపం రాదు. గుడ్లలో ప్రోటీన్‌తో పాటుగా ఫోలేట్ లభిస్తుంది. ఒక గుడ్డు తింటే 22 మైక్రోగ్రాముల విటమిన్ బి9 లభిస్తుంది. బ్రోకలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు బ్రోకలీలో 84 మిల్లీగ్రాముల ఫోలేట్ లభిస్తుంది.
నారింజ, గ్రేప్‌ఫ్రూట్, నిమ్మకాయల్లో విటమిన్ సితో పాటుగా ఫోలేట్ లభిస్తుంది. ఒక పెద్ద నారింజలో 55 మిల్లీగ్రాముల విటమిన్ బి9 లభిస్తుంది. బీట్రూట్లో ఐరన్‌తో పాటుగా విటమిన్ బి9 లభిస్తుంది. వండిన అరకప్పు బీట్రూట్ కూరలో 68 మిల్లీగ్రాముల ఫోలేట్ లభిస్తుంది.
ఆస్పరాగస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరకప్పు వండిన ఆస్పరాగస్‌లో 134 మిల్లీగ్రాముల విటమిన్ బి9 లభిస్తుంది. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌లో ఫోలేట్ ఎక్కువగా ఉంటుంది. అర కప్పు బ్రస్సెల్స్ స్ప్రౌట్స్‌లో 47 మిల్లీగ్రాముల ఫోలేట్ లభిస్తుంది
.