
పశ్చిమబెంగాల్లో తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నుంచి విడిపోయిన 20 మంది రెబెల్ ఎంపీలు వేరు కుంపటి పెట్టుకున్నారు. తాజాగా వీరు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమకు లోక్ సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని కోరారు.
అలాగే తాము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా(NCPI)లో విలీనం అవుతామని కూడా వెల్లడించారు. దీంతో ఈ కొత్త పార్టీ పూర్వాపరాలపై చర్చ జరుగుతోంది.ఢిల్లీకి తృణమూల్ పంచాయతీ..! అభిషేక్ వర్సెస్ రెబెల్స్..!ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకు చెందిన ఈ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా వ్యవస్ధాపకుడు శాంతను డే దీనిపై స్పందించారు.
తమ పార్టీలో 20 మంది టీఎంసీ రెబెల్స్ విలీనం కానుండటంపై సోషల్ మీడియాలో సమాచారం తెలుసుకున్నట్లు ఆయన వెల్లడించారు. NCPI వ్యవస్థాపకుడు, జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన శాంతను డే .. సోషల్ మీడియా, వార్తల ద్వారా తనకు ఈ విషయం తెలిసిందన్నారు.
TMC: ఊహించని పార్టీలోకి టీఎంసీ రెబెల్స్ విలీనం- స్పీకర్ కు లేఖ..!తనతో చర్చలు జరపడానికి టీఎంసీ రెబెల్స్ ను ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తన పార్టీ విస్తరిస్తుంటే సంతోషించకుండా ఎందుకు ఉంటానన్నారు. పార్టీ అధ్యక్షుడే ఈ నిర్ణయం తీసుకున్నారని విన్నాన్నారు.
దీని గురించి తనను వారు ఇంకా సంప్రదించలేదన్నారు. తాను పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నానని, పార్టీ విస్తరిస్తే, దేశం కోసం మనం పని చేయగలుగుతామన్నారు. తాము ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నామని, దేశం కోసం ఎన్డీఏ (NDA)తో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని తెలిపారు.
తమ కార్యాలయ నమోదు హౌరాలోని జాగో బిశ్వ భవనంలో ఉందన్నారు. ఒకవేళ రెబెల్ ఎంపీ ల నాయకురాలు కకోలీ దస్తీదార్ తమతో మాట్లాడితే, ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లి చర్చలు జరుపుతామన్నారు
.