
– ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య – పీవీకే-5 గని గేట్ మీటింగ్‌లో ఐటీయూసీ హెచ్చరిక రుద్రంపూర్, జూన్ 15 : సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే సంస్థ వ్యాప్తంగా సమ్మె తప్పదని, జూన్ 22 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు సిద్ధంగా ఉండాలని ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య పిలుపునిచ్చారు. సోమవారం పీవీకే-5 గనిలో నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ కార్మికుల సహనాన్ని యాజమాన్యం బలహీనతగా భావించవద్దని హెచ్చరించారు.
ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పులు, పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు, డిపెండెంట్ ఉద్యోగాల వంటి సమస్యల పరిష్కారంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక సంక్షేమం, సంస్థ అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు.
మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు నియామక ఉత్తర్వులు జారీ కావడం ఎఐటీయూసీ పోరాట ఫలితమేనని పేర్కొన్న ఆయన, కార్మికులు ఐక్యంగా పోరాడితే మరిన్ని సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కొత్త కోల్ బ్లాకుల కేటాయింపు, కొత్త గనుల ప్రారంభం, సంస్థ విస్తరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
యూనియన్‌తో జరిగిన సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్లు అమలు కాకపోవడం వెనుక రాజకీయ జోక్యమే కారణమని ఆరోపించిన రంగయ్య, సమస్యలు పరిష్కరించకపోతే సింగరేణిని స్తంభింపజేసే స్థాయిలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్మిక హక్కులు, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్ పరిరక్షణ కోసం జరిగే పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ఇవ్వాలని కోరారు.
, పిట్ కార్యదర్శులు మధుకృష్ణ, కమల్, సీనియర్ నాయకులు మండల రాజేశ్వరరావు, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి సందీప్, మైనింగ్ స్టాప్ ఇన్చార్జి సాయి పవన్, సేఫ్టీ కమిటీ మెంబర్ రాంచందర్, నారాయణ, లాల్ సింగ్, కుమార్ రావు, సంజీవ్,మోహన్, సురేందర్ రెడ్డి, కనకయ్య, మహేశ్, ముబారక్, గణేష్, సునీల్, నరేశ్, విక్రమ్, సహాదేవ్, సుదీర్, బాబురావు, మదనయ్య, కోటేశ్వరరావు, సుధాకర్, దస్తగిరి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి వి.మల్లికార్జున్ రావు, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి, వైస్ ప్రెసిడెంట్లు కత్తెర్ల రాములు, సహాయ కార్యదర్శి గట్టయ్య, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, ఎస్.నాగేశ్వరరావు, హుమాయూన్