
Nipah Virus Alert: దక్షిణ భారతదేశంలో మరోసారి నిఫా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతోంది. కేరళలోని కోజికోడ్ (Kozhikode) జిల్లాలో ఒకరికి నిఫా వైరస్ సోకినట్లు పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ (NIV) నిర్ధారించడంతో అటు కేరళ, ఇటు పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి.
కోజికోడ్ లోని రమణట్టుకర మున్సిపాలిటీకి చెందిన 43 ఏళ్ల బాధితుడు ప్రస్తుతం కోజికోడ్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అతనికి మోనోక్లోనల్ యాంటీబాడీ (Monoclonal Antibody) చికిత్సను అందిస్తున్నారు.
Read Also :2027 Weather Alert: 2027లో రికార్డు స్థాయి ఎండలు వైరస్ నిర్ధారణ అయిన వెంటనే రంగంలోకి దిగిన కేరళ ఆరోగ్య శాఖ అధికారులు బాధితుడితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించారు. కేరళలో కేసు నమోదు కావడంతో తమిళనాడు ప్రభుత్వం సరిహద్దు జిల్లాలైన నీలగిరి, కోయంబత్తూర్, తేని, కన్యాకుమారి, కడలూరు జిల్లాలను అలర్ట్ చేసింది.
తాళూర్, నాడుగని, నంబియార్‌కున్ను, సోలాడి, పట్టవాయల్ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను మోహరించారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ మరియు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద లక్షణాలు ఉన్నవారిని ప్రత్యేక వైద్య శిబిరాలకు తరలిస్తున్నారు.
వైరస్ వ్యాప్తి కాలం: ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిఫా వైరస్ వ్యాప్తికి అనుకూల కాలంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది దీని ప్రధాన లక్షణాలు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు సూచిస్తున్న జాగ్రత్తలు: అధికారిక హెల్ప్‌లైన్ నంబర్లు: ఏదేని అనుమానాస్పద సమాచారం లేదా అత్యవసర సహాయం కోసం కేరళ ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచిన నంబర్లు: 0495-2373901, 9072007767.
మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
US-Iran peace agreement : అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
2027 Weathe Alert: 2027లో రికార్డు స్థాయి ఎండలు
Microsoft CEO : AI ముప్పు ..ఉద్యోగాలను ఎలా కాపాడుకోవాలిపై సత్య నాదెళ్ల దిశా నిర్దేశం
Raghava Lawrence Political Entry: సీఎం విజయ్ తో లారెన్స్ దోస్తీ.. ‘టీవీకే’ పార్టీ తరఫున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికల బరిలోకి?
CM Vijay Divorce Case: విజయ్ విడాకుల కేసులో నేడు కీలక విచారణ
MSBTE Results 2026: విడుదల కానున్న MSBTE ఫలితాలు..స్కోర్ కార్డ్ డౌన్లోడ్ లింక్ ఇదే! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి