టాలీవుడ్లో కమర్షియల్ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. విలక్షణమైన కామెడీ, పక్కా ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఇండస్ట్రీలో దాదాపు 100 శాతం సక్సెస్ రేటును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సీజన్ వస్తోందంటే చాలు, అనిల్ రావిపూడి సినిమా థియేటర్లలో నవ్వుల పంట పండించడం ఖాయమనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది.
2025లో ‘సంక్రాంతికి వస్తున్నాం’, 2026లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాలతో వరుస బ్లాక్బస్టర్లు అందుకుంటూ టాప్ డైరెక్టర్ల రేసులో మరింత ఎత్తుకు ఎదిగారు. ఈ క్రమంలోనే ఆయన తన తదుపరి చిత్రంగా టాలీవుడ్లో మరో భారీ క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు.* విజయ్-సంగీత విడాకుల కేసులో కీలక పరిణామం… ఆగస్టు 7న ఏం జరగబోతోంది!
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వెంకటేష్‌తో 'F2', 'F3', ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వరప్రసాద్ గారు(గెస్ట్ రోల్) వంటి బ్లాక్బస్టర్లు, కళ్యాణ్ రామ్‌తో తన తొలి చిత్రం 'పటాస్'తో బంపర్ హిట్ అందుకున్న అనిల్..
ఇప్పుడు వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూపించబోతున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ పూర్తి స్థాయి యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి కాగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా ముగిశాయి.
ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రేజీ ప్రాజెక్టుకు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన టైటిల్ జోరుగా ప్రచారంలోకి వచ్చింది. పండుగ వాతావరణానికి, అనిల్ రావిపూడి మార్క్ వినోదానికి సరిగ్గా సరిపోయేలా ఈ చిత్రానికి ‘సంక్రాంతి సరుకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ నడుస్తోంది.
రీచ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.* అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి షాకింగ్ న్యూస్.. ‘రాకా’ ఇంకా వెనక్కి వెళ్లిపోతుందా?ట్రైలర్ లేకుండా సినిమా ఇదిలా ఉంటే, ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘సింగ్ గీతం’ సినిమా 'గోల్డెన్ బ్లాక్‌బస్టర్' ఈవెంట్‌కు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో తెరకెక్కించిన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం 'సింగ్ గీతం'. జూన్ 12న విడుదలై అద్భుతమైన టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్ర సక్సెస్ మీట్లో అనిల్ రావిపూడి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘ఈ వయసులో కూడా సింగీతం శ్రీనివాసరావు గారు ఇలాంటి అద్భుతమైన ఫాంటసీ కంటెంట్‌తో సినిమా తీయడం మామూలు విషయం కాదు, ఆయన మాకందరికీ స్పూర్తి. సాధారణంగా మేమంతా ఎంతో కష్టపడి, కిందా మీదా పడి ట్రైలర్లు కట్ చేసి సినిమాపై హైప్ పెంచాలని చూస్తుంటాం. కానీ నిర్మాత నాగ్ అశ్విన్ మాత్రం ఈ సినిమాకు ఎలాంటి అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయకుండానే, కొన్ని మంచి మాటలతో థియేటర్లలోకి తెచ్చి బ్లాక్‌బస్టర్ కొట్టాడు. ఈ ఫార్ములా నాకు బాగా నచ్చింది. ఇకపై నేను కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతా.. నా నెక్స్ట్ సినిమాలకు ట్రైలర్లు కట్ చేయను’ అంటూ తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించారు. దీనితో అనిల్ రావిపూడి రాబోయే 'సంక్రాంతి సరుకు' చిత్రానికి నిజంగానే ట్రైలర్ లేకుండా వస్తారా అంటూ సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
పండుగ సీజన్ టార్గెట్‌గా వస్తున్న సినిమా కావడం వల్ల ఈ టైటిల్ అయితే మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బలంగా