
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు తన జర్నీని విజయంతో ఘనంగా ప్రారంభించింది. నిన్న ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 64 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు చేతిలో ఘోర ఓటమిపై పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా మాట్లాడుతూ..
బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో వైఫల్యాల కారణంగానే పరాజయం తప్పలేదని అన్నారు. అలాగే బౌలింగ్‌లో చివరి ఓవర్లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం దెబ్బతీసిందని తెలిపారు. ఓటమిపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా స్పందనమ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా తమ ఓటమికి గల కారణాలను విశ్లేషించారు.
తమ బ్యాటింగ్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిందని ఆమె అంగీకరించారు. "మా బ్యాటింగ్ చాలా నిరాశపరిచింది. టోర్నమెంట్లో ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. రాబోయే మ్యాచ్‌లలో తప్పకుండా పుంజుకోవాలి" అని అన్నారు.భారత ఇన్నింగ్స్ సమయంలో 15 ఓవర్ల వరకు తాము నియంత్రణలోనే ఉన్నప్పటికీ, చివరి ఓవర్లలో అదనపు పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ చేజారిందని ఆమె తెలిపారు.
"ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలే మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి. క్యాచ్‌లు మ్యాచ్‌లను గెలిపిస్తాయి. కానీ మేము కీలకమైన క్యాచ్‌లు వదిలేశాం. తదుపరి మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్ రెండింటిలోనూ మెరుగుపడాల్సిన అవసరం ఉంది" అని ఫాతిమా సనా స్పష్టం చేశారు.
ఈ విజయంతో ప్రపంచకప్‌లో భారత్ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగా, పాకిస్థాన్ తమ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది
.