
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. జపాన్ అభిమానులు మాత్రం తమ సంస్కృతి, క్రమశిక్షణతో ఎప్పుడూ మనసులను గెలుచుకుంటూ ఉంటారు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించి మరోసారి ప్రపంచంతో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆదివారం టెక్సాస్‌లోని ఏటీఅండ్‌టీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్ ముగిసిన తర్వాత వారు ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి అందరినీ ఆకట్టుకుంది.హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ 2-2 గోల్స్‌తో డ్రాగా ముగిసింది. మ్యాచ్ ముగియగానే దాదాపు 69,000 మంది ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోతుండగా, జపాన్ అభిమానులు మాత్రం తమ సీట్లలోనే ఉండిపోయారు.
వారు తమతో తెచ్చుకున్న నీలిరంగు ప్లాస్టిక్ సంచులతో గ్యాలరీల్లో పేరుకుపోయిన ఖాళీ బాటిళ్లు, ప్యాకెట్లు, ఇతర చెత్తను ఓపికగా ఏరడం ప్రారంభించారు. ‘ది ఇండిపెండెంట్’ కథనం ప్రకారం తాము కూర్చున్న సెక్షన్‌ను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాతే వారు స్టేడియం విడిచి వెళ్లారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మనసులను గెలుచుకుంటున్నాయి.జపాన్ అభిమానులకు ఇది కొత్తేమీ కాదు. 1998లో ఫ్రాన్స్‌లో జరిగిన ప్రపంచకప్‌లో తొలిసారి పాల్గొన్నప్పటి నుంచి ప్రతి టోర్నమెంట్లోనూ వారు ఈ పద్ధతిని పాటిస్తున్నారు.
2022 ఖతార్ ప్రపంచకప్‌లోనూ జర్మనీపై గెలిచిన తర్వాత స్టేడియాన్ని శుభ్రం చేసి వార్తల్లో నిలిచారు. ఈ క్రమశిక్షణకు మూలాలు వారి విద్యా వ్యవస్థలోనే ఉన్నాయి. జపాన్‌లో 'సౌజి' పేరుతో పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు తమ పరిసరాలను తామే శుభ్రం చేసుకోవడాన్ని నేర్పిస్తారు.గెలుపోటములతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతను ప్రదర్శించడం ద్వారా జపాన్ అభిమానులు మరోసారి