
సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆపరేషన్ క్రాక్‌డౌన్ పేరుతో దాడులు నిర్వహిస్తుండగా.. హైదరాబాద్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ పేరుతో హడలెత్తిస్తున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లకు ఏంచేయాలో పాలుపోక పోలీసులే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు.
దోచుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని ఉద్దేశపూర్వకంగా వందల ఖాతాల్లోకి పంపుతున్నారు. దీనివల్ల ఒక్క కేసులో వందల మందికి నోటీసులిచ్చి వివరాలు ఆరా తీయడానికే పోలీసులకు నెలలు పడుతోంది. ఇలా వారు అదే పనిలో నిమగ్నమయ్యేలా చేసి తమపని తాము చేసుకోవాలన్నది నేరగాళ్ల వ్యూహం.
ఒక్క నేరం.. వందల ఖాతాలు
|