
ఓఎల్ఎక్స్ కేటుగాడు ‘భీముడు అజిత్‌కుమార్’ అదే ఎత్తుగడ తమిళనాడులో పట్టుబడినా కోయంబత్తూరు ఆసుపత్రి నుంచి మళ్లీ పరార్ ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు ఈనాడు, అమరావతి: నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి, ఓఎల్ఎక్స్ వేదికగా కోట్ల రూపాయల ఆన్లైన్ మోసాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర నేరగాడు భీముడు అజిత్‌కుమార్ తమిళనాడులో మరోసారి తప్పించుకుని.. మళ్లీ దొరికాడు.
గుంటూరు జీజీహెచ్ నుంచి మూడు నెలల క్రితం పోలీసుల కళ్లుగప్పి పరారైన ఈ చోరుడు.. ఇటీవల తిరుపూర్‌లో పట్టుబడ్డాడు. అయితే, మళ్లీ తన పాత అనారోగ్య డ్రామానే మరోసారి ఆడి.. కోయంబత్తూరు ఆసుపత్రిలో చేరాడు. రెండు రోజుల క్రితం అక్కడి నుంచి పారిపోగా..
తమిళనాడు పోలీసులు ఆదివారం ఉదయం సమీప పట్టణంలో అతణ్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. తమిళనాడులోని తిరుపూర్ పోలీసులకు పట్టుబడటానికి ముందు అజిత్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గుండు చేయించుకున్నాడు. పగలు అద్దెకార్లలో తిరుగుతూ, రాత్రివేళ ఏదో పట్టణంలోని లాడ్జీల్లో బస చేసేవాడు.
పోలీసుల ట్రాకింగ్‌కు దొరక్కుండా తాను బసచేసే లాడ్జీలకు 8-10 కిలోమీటర్ల దూరంలోనే కారు దిగి, అక్కడి నుంచి ఆటోలు, బస్సుల్లో వెళ్లేవాడు. ఎప్పటికప్పుడు సిమ్‌కార్డులు మారుస్తూ, డ్రైవర్ ఫోన్ ద్వారా ఓఎల్ఎక్స్ మోసాలకు పాల్పడేవాడు.
ఒకరిని మోసం చేయగానే కారును, డ్రైవర్‌ను వదిలేసి మకాం మార్చేసేవాడు. అలా.. తిరుపూర్‌లో ఓ బంగారు దుకాణం యజమానికి రూ.11 లక్షలకు కారు విక్రయిస్తానని నమ్మించి అజిత్ మోసం చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తిరుపూర్ క్రైమ్ విభాగం పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా డ్రైవర్‌ను విచారించి, చివరకు అజిత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడినప్పుడు పోలీసులకు రూ.లక్షల్లో లంచం ఎరచూపి తప్పించుకోవడానికి బేరాలు చేసినట్లు సమాచారం. కోయంబత్తూరు ఆస్పత్రి వైద్యులు డిశ్చార్జి చేశాకే అజిత్‌ను పీటీ వారంట్‌పై గుంటూరు పోలీసులకు అప్పగిస్తామని కోయంబత్తూర్ జైలర్ స్పష్టం చేశారు.
తమిళనాడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గతంలోనూ ఇలా ఆసుపత్రి నుంచి తప్పించుకోవడంతో కోయంబత్తూరు ఆసుపత్రిలో అతని కదలికలపై పోలీసులు నిఘా పెంచారు.
అయినా పోలీసుల కళ్లుగప్పి రెండు రోజుల క్రితం కోయంబత్తూరు ఆసుపత్రి నుంచి అజిత్ తప్పించుకున్నాడు. అప్రమత్తమైన తమిళనాడు పోలీసులు.. అతని ఆచూకీ కోసం జల్లెడ పట్టారు. సీసీ కెమెరాల దృశ్యాలను వడపోయడంతో సమీపంలోని ఓ పట్టణంలో అజిత్ ఉన్నట్లు గుర్తించి.. ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోయంబత్తూరు జైలుకు తరలించినట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
దీంతో గుంటూరు జిల్లా ఎస్పీ ఈ విషయాన్ని