
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Wargangal BRS Party Meeting: 'సర్ ప్రక్రియలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. ఎవరిదైనా ఓటు మిస్ అయితే హైకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. ఎవరైతే బాధ్యత తీసుకొని పని చెయ్యకపోతే తల్లికి ద్రోహం చేసినట్లు అవుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు.
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అయితే బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు. అంత మన మంచికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు.
'సర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఏరియాతో కొన్ని పార్టీలను దెబ్బతీశాయని వార్తలు వచ్చాయి. ఒక రాజకీయ పార్టీగా పోలింగ్ బూత్‌లలో మనం ఏం చేయాలో ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది.
ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత చురుగ్గా పాల్గొంటే రేపు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంత మంచి మనకి జరుగుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కార్పొరేటర్‌గా పనిచేసిన వాళ్లు, కార్పొరేటర్‌గా పోటీ చేయాలనుకునే వాళ్లు చాలా యాక్టివ్‌గా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డికి అంతే గతి హిట్లర్‌కి ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి అంతే గతి పడుతుందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో అవినీతి, సింగరేణిలో అవినీతి, హ్యామ్ మోడల్ రోడ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం
మొత్తం అవినీతిమయం. మంచిర్యాలకు పోయిన భట్టి విక్రమార్క 40 లక్షల బొగ్గు ఎక్కడుందో చూయించాలని సవాల్ చేశారు. సింగరేణి కుంభకోణంపై సూటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానం రావడం లేదని తెలిపారు.
'నా అంత మొగుడు లేనట్లు' 'నేను గట్టిగా మాట్లాడితే నాపై కేసులు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంటుంది. సింగరేణిలో అవినీతి జరిగిందని నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తే దొంగ చేతికి తాళం ఇచ్చి విచారణ చేయండి. మట్టి కుప్పలపై బొగ్గు పేరుస్తున్నారు, ఇది బయట పెట్టాలి' అని భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. 'వడ్లు కొనకముందే నా అంత మొగుడు లేనట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేపర్లో వాణిజ్య ప్రకటన ఇచ్చుకున్నాడు. ఆనాడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కేసీఆర్ హయాంలో కొన్నాం. 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనకముందే మొలకెత్తిన వడ్లు కొనే తెలివిలేదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీను మొలకెత్తినయ్యని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
పోలీసులకు హెచ్చరిక 'కొంతమంది పోలీస్ అధికారులు ఎక్కువ చేస్తున్నారు. సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వార్తలు వస్తున్నాయి. చట్ట ప్రకారం పోలీస్ అధికారులు పని చెయ్యాలి. వరంగల్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కువగా కేసులు పెడుతున్నారు. చట్టం అందరికీ సమానమే విషయాన్ని పోలీస్ అధికారులు మరిచిపోవద్దు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హెచ్చరించారు. 'పోలీస్ అధికారులకు మంచి చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు 5 సరెండర్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలీసులకు కేసీఆర్ గౌరవం పెంచారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.