
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. June 15 Astrology : జూన్ 15వ తేది శ్రీ పరాభవ నామ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాసంలో చివరి తిథి అమావాస్య. మృగశిర నక్షత్రం ఉంది.
రేపటి నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ నెల 17 నుంచి వివాహాది, గృహ ప్రవేశాలు ఇతర శుభ కార్యాలకు మంచి ముహూర్తాలున్నాయి. మొత్తంగా గ్రహాలు, నక్షత్రాల కదలికల ద్వారా ఆయా రాశులకు సంబంధించిన జాతక ఫలితాలు నిర్దేశించబడుతాయి.
సోమవారం నాడు శివుడిని పూజించడం అనాదిగా వస్తుంది. మత విశ్వాసాల ప్రకారం, సోమవారం శివుడిని పూజించడం వల్ల జీవితంలోని కష్టాలు పూర్తిగా తొలిగిపోతాయని మన పురాణాలతో పాటు శాస్త్రాలు చెబుతున్న మాట. జ్యోతిష్య గణనల ప్రకారం.. జూన్ 15వ తేదీ సోమవారం నాడు కొన్ని రాశుల వారికి అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది.
అయితే మరికొందరు జీవితంలో ఇబ్బందులను ఫేస్ చేయవచ్చు. జూన్ 15వ తేదీన ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో ఓ లుక్కేద్దాం. మేష రాశి: జూన్ 15న మేష రాశి వారికి ఈ రోజు మొత్తంగా సానుకూల దృక్పథంతో సాగిపోతుంది. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలు వేసుకుంటారు.
ఒత్తిడికి దూరంగా ఉండటం బెటర్. ఈ రోజు, మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించడం బెటర్. అధిక పని ఒత్తిడి మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుబోతుంది. పనికి జీవిత సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగడం బెటర్. కర్కాటక రాశి
: జూన్ 15వ తేదీ మీకు ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. మీ దిన చర్య గతంలో కంటే మెరుగ్గా ఉండబోతుంది. ఆఫీసు రాజకీయాలు మీకు కొంత వ్యతిరేకంగా మారే అవకాశాలున్నాయి. సానుకూల దృక్పథాన్ని అలవరుచుకోండి. మీ పనిపై దృష్టి సారించడం వలన అనుకూల ఫలితాలను అందుకుంటారు. గాసిప్‌లకు దూరంగా ఉండటం బెటర్.
సింహ రాశి: సింహరాశి వారికి జూన్ 15వ తేదీ చాలా బిజీ బిజీగా గడుపుతారు. పనిలో మీకు అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. అధిక ఒత్తిడికి దూరంగా ఉండటం బెటర్. పని-జీవిత సమతుల్యతను పాటిస్తూ ముందుకు సాగడం బెటర్. అప్పుడప్పుడు పనిలో విరామం తీసుకోవడం వలన పనిపై మరింత శ్రద్ద పెట్టగలుగుతారు.
కన్య రాశి: జూన్ 15వ తేదీ కన్య రాశి వారు తమ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. ఫిట్‌నెస్‌కు సంబంధించిన విషయంలో అప్రమత్తతతో మెలగాలి. ఈ రోజు బద్ధకంగా ఉండవచ్చు. కానీ చేసే పనులకు ఎక్కడా బ్రేక్ ఇవ్వొద్దు. మీ పనిని సమయానికి పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం బెటర్. అదృష్టం మీకు తోడుగా నిలుస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఒక రొమాంటిక్ డేట్‌ను ప్లాన్ చేసుకోవడం బెటర్.
వృషభ రాశి: జూన్ 15న ఆరోగ్యకరమైన ఆహారంతో మీ పని ప్రారంభిస్తారు. ప్రేమ జీవితం సాఫీగా సాగిపోతుంది. మీ జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురు కావొచ్చు. అన్ని విషయాలను సమదృష్టితో చూడటం బెటర్.
మిథున రాశి.. జూన్ 15న అవసరమైతే కుటుంబం లేదా భాగస్వామి నుండి ముఖ్యమైన సలహా తీసుకోవడం బెటర్. ఊహించని ధన లాభాలను అందుకుంటారు. ఈ రోజు వినూత్న ఆలోచనలపై దృష్టి పెట్టడంతో మీ జీవితంలో మరింత ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ వృత్తి జీవితంలో సవాళ్లను స్వీకరిస్తారు.
మకర రాశి: జూన్ 15 మీ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. యోగా వలన మీ జీవితంల సాఫీగా ఉండబోతుంది. రీసెంట్గా కుదిరిన ఒక ఒప్పందం మీ కెరీర్‌ను మార్చబోతుంది. మీ ప్రేమ జీవితంలో కొనసాగుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుంభ రాశి: జూన్ 15: మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యమైన పని. ఈ రోజు దేవుడిని ధ్యానం చేయడం వలన మెరుగైన ఫలితాలను అందుకుంటారు. అమావాస్య తిథి కాబట్టి కొత్త లావాదేవీలు వేటిని ప్రారంభంచక పోవడం బెటర్. మీ కెరీర్లో నిలదొక్కుకోవడానికి మీరు మరింత కష్టపడాల్సిన సమయం ఇదే. పాత పెట్టుబడుల నుండి మీకు ఆశించిన రాబడి లభించకపోవచ్చు.
తుల రాశి: జూన్ 15వ తేదీ (ఈ రోజు) కొంచెం ఈ రాశులకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. పని కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు త్వరగా వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వ్యాపారం, ఆరోగ్యం, డబ్బు విషయాలు లేదా ప్రేమ జీవితంలో పెద్ద మార్పులకు సిద్ధంగా ఉండండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేయడం బెటర్.
వృశ్చిక రాశి: జూన్ 15వ తేదీ మీకు ఒక రొమాంటిక్ రోజుగా ఉండబోతుంది. ఈ రోజు మీలో పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దూరపు సంబంధాలు మెరుగు అవుతాయి. అంతేకాదు ప్రేమ జీవితంలోని సవాళ్లను పరిష్కరించుకుంటారు. మీ పెట్టుబడుల కోసం ఒక వ్యూహాన్ని రూపొందించుకోవడం బెటర్. అన్ని సమస్యలపై దృష్టి సారించాలి.
ధనుస్సు రాశి: జూన్ 15వ తేదీ మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తంది. విదేశాలకు వెళ్లేవారికి ఇదే అద్భుతమైన అవకాశం. పనిని సమయానికి పూర్తి చేయడంలో విఫలమైతే పై అధికారులు లేదా యాజమాన్యం సరైన గుర్తింపు లభించపోవచ్చు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డబ్బు చేతికి అంది వస్తుంది. అదనపు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. బయట ఆహారం తినడం మానుకోవడం బెటర్.
మీన రాశి: జూన్ 15వ తేదీ మీకు చాలా మంచి రోజుగా గుర్తుండి పోతుంది. మీకు ఒక ముఖ్యమైన కెరీర్‌కు సంబంధించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉండబోతుంది. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి.
Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం లేదా ఖచ్చితమైనదని జీ మీడియా చెప్పడం లేదు. గ్రహ గతులు, వాటి గోచారం ఆధారంగా జ్యోతిష్య శాస్త్రం చెప్పిన విషయాలను మాత్రమే మేము ప్రస్తావించాము. జీ మీడియా ఈ న్యూస్‌కు బాధ్యత వహించదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.