
Vijay Deverakonda Rashmika Scholarships | నాగర్‌కర్నూల్/బల్మూరు, జూన్ 14: తమకు పుట్టిన సొంత ఊరుపై ఉన్న మమకారాన్ని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులపై ఉన్న ప్రేమను చాటుకుంటూ టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ దంపతులు విజయ్ దేవరకొండ – రష్మిక మందన ఉదారత చాటుకున్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ‘దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో భారీ నగదు ప్రోత్సాహకాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్‌పేట గ్రామ సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ స్కాలర్‌షిప్‌ల పంపిణీ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. స్థానిక అచ్చంపేట శాసనసభ్యులు (MLA) డాక్టర్ వంశీకృష్ణతో కలిసి నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన దంపతులు ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు చెక్కులను అందజేశారు.
Read Also : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ వసూళ్ల ప్రభంజనం.. తొమ్మిది రోజుల్లో వసూళ్లు ఎంతంటే..? మూడు నెలల క్రితం జరిగిన తమ వివాహం అనంతరం.. అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న మెరిట్ విద్యార్థులకు వ్యక్తిగతంగా స్కాలర్షిప్లు అందిస్తామని విజయ్-రష్మిక దంపతులు ప్రకటించిన నినాదాన్ని ఈ సందర్భంగా నిజం చేసి చూపించారు.
నియోజకవర్గ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 188 మంది విద్యార్థినీ విద్యార్థులకు మొదటి ర్యాంకు సాధించిన వారికి రూ. 10,000, ద్వితీయ ర్యాంకు సాధించిన వారికి రూ. 5,000 చొప్పున దేవరకొండ ఫౌండేషన్ ద్వారా చెక్కులను అందజేశారు.
విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి – గోవర్ధన్ రావు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి (DEO) రమేష్ కుమార్ లతో కలిసి ఈ నగదు ప్రోత్సాహకాలను దంపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ..
సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ కుటుంబాన్ని చూసి తాను అచ్చంపేట శాసనసభ్యుడిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. “వెండితెరపై ‘శ్రీమంతుడు’ సినిమాలో ఊరిని దత్తత తీసుకున్న రీల్ హీరో మహేష్ బాబు అయితే.. నిజ జీవితంలో ఇక్కడి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న రీల్ అండ్ రియల్ హీరోలు మన విజయ్ దేవరకొండ, రష్మిక మందన” అని కొనియాడారు.
విజయ్ మన అచ్చంపేట ప్రాంతానికి చెందిన బిడ్డ కావడం, ఈ ప్రాంత కోడలిగా రష్మిక దేవరకొండ ఇక్కడికి రావడం తమకెంతో సంతోషాన్ని ఇస్తోందన్నారు. ఇదే స్ఫూర్తితో అచ్చంపేట ప్రాంతంలో పేద విద్యార్థుల అంతర్జాతీయ స్థాయి విద్య కోసం విజయ్ దేవరకొండ దంపతులు ఒక ‘ఇంటర్నేషనల్ స్కూల్’ను కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఈ వేదిక ద్వారా కోరారు.
స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు నటి రష్మిక మాట్లాడుతూ.. విద్యార్థులపై నమ్మకాన్ని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే ఈ స్కాలర్‌షిప్‌ల ముఖ్య ఉద్దేశమన్నారు. చదువుపై పూర్తి ఏకాగ్రతతో పాటు క్రమశిక్షణను అలవర్చుకుంటే జీవితంలో ఎంతటి ఉన్నత శిఖరాలనైనా సులభంగా అధిరోహించవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాలలో తెలంగాణ రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్ జిల్లా ద్వితీయ స్థానంలో నిలవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను అభినందించారు. జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకుని క్రమశిక్షణతో, ఆడుతూ పాడుతూ చదవాలని సూచించారు. ఈ వినూత్న ప్రోత్సాహక కార్యక్రమాన్ని కేవలం అచ్చంపేటకే పరిమితం చేయకుండా రాబోయే రోజుల్లో నాగర్‌కర్నూల్ జిల్లా అంతటా, ఆపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఏటా విధిగా అమలు చేస్తామని స్టార్ కపుల్ సంచలన ప్రకటన చేశారు.
అంతకుముందు విజయ్ దేవరకొండ తల్లి మాధవి మాట్లాడుతూ.. తమ సొంతూరు గట్టుతుమ్మెన్ అని, కన్న ఊరిపై ఉన్న ప్రేమతోనే చిన్నపిల్లల చదువుల కోసం ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, ఇతరులకు గౌరవం ఇస్తూ సమాజం గర్వపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ అద్భుత వేడుకలో విజయ్ దేవరకొండ వ్యక్తిగత కార్యదర్శి (PA) కన్నారావు, నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, లబ్ధి పొందిన వందలాది మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని దేవరకొండ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
MLA Amilineni Surendrababu:ఒక్క రక్తదానంతో మూడు ప్రాణాలు.. ఎమ్మెల్యే చేసిన సేవలు తెలుసా?
Vizianagaram Yogandhra: యోగాతో ఆరోగ్యం,ఐశ్వర్యం: మంత్రి కొండపల్లి
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Peddi Latest Collections : రూ.400 కోట్ల మార్క్ దిశగా ‘పెద్ది’ పరుగు
Vijay-Rashmika: మాట నిలబెట్టుకున్న విజయ్, రష్మిక..విద్యార్థులకు అండగా దేవరకొండ ఫౌండేషన్
aaranasi Movie : వైజాగ్ లో ‘వారణాసి’ షూటింగ్
Sonu Sood: వందే భారత్‌లో ప్రయాణించిన సోనూ సూద్.. గతాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగం!
Peddi : ‘పెద్ది’ టీమ్ ను అభినందించిన మెగాస్టార్
కన్న ఊరిని, తన ప్రాంతాన్ని మరవకుండా ఇంతటి గొప్ప