
కర్ణాటకలోని ప్రపంచ ప్రఖ్యాత హంపిలో ఉన్న 15వ శతాబ్దానికి చెందిన విఠల ఆలయం అనేక అద్భుతాలకు నెలవు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీత స్తంభాల గురించి. గట్టి గ్రానైట్ రాళ్లతో నిర్మించిన ఈ స్తంభాలను మెల్లగా తాకినప్పుడు, అవి స్పష్టమైన సంగీత స్వరాలను ఎలా పలికిస్తాయనేది శతాబ్దాలుగా అంతుచిక్కని రహస్యం.
అయితే, ఆధునిక శాస్త్రీయ విశ్లేషణలు ఈ పురాతన ధ్వని ఇంజనీరింగ్ అద్భుతం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి మహామండపంలో ఉన్న ఒక్కో ప్రధాన స్తంభం చుట్టూ, అదే రాతి నుంచి చెక్కిన అనేక చిన్న స్తంభాలు ఉంటాయి.
వీటిని సమిష్టిగా "సరిగమ స్తంభాలు" అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో నృత్యకారులు నాట్యం చేస్తుండగా, ఈ స్తంభాలను తాకుతూ లయకు అనుగుణంగా శబ్దాలు సృష్టించేవారని చరిత్రకారులు చెబుతారు. ఈ స్తంభాలు ప్రాచీన భారతీయ గ్రంథమైన 'నాట్య శాస్త్రం'లో' పేర్కొన్న 'ఘన వాద్య' వర్గానికి చెందినవి.ఈ స్తంభాల నిర్మాణంపై ఎన్నో ఊహాగానాలు ఉండేవి.
లోపల ఖాళీగా ఉంచడం వల్ల లేదా లోహపు కడ్డీలు అమర్చడం వల్ల శబ్దం వస్తుందని భావించేవారు. కానీ, కల్పక్కంలోని ఇందిరా గాంధీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ (IGCAR) మెటలర్జీ శాస్త్రవేత్తలు 2008లో చేసిన ఒక కీలక అధ్యయనం ఈ వాదనలను తోసిపుచ్చింది.
వారు స్తంభాలకు ఎలాంటి హాని కలగకుండా అల్ట్రాసోనిక్ టెస్టింగ్, ఇంపాక్ట్-ఎకో వంటి నాన్-డిస్ట్రక్టివ్ పద్ధతులను ఉపయోగించి పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో స్తంభాలు