బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం నమోదయ్యింది. న్యూయార్క్ నిక్స్ 53 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎన్బీఏ) చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్బీఏ చరిత్రలో న్యూయార్క్ నిక్స్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి.
శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో న్యూయార్క్ నిక్స్ 94-90 తేడాతో సాన్ ఆంటోనియో జట్టుపై విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో మొదట సాన్ ఆంటోనియో ఆదిపత్యం చెలాయించగా, న్యూయార్క్ నిక్స్ ఆఖర్లో అద్భుతంగా ఫుంజుకోవడం విశేషం.
చివరిసారిగా 1973లో ఈ టైటిల్ గెలిచిన నిక్స్ జట్టు, మళ్లీ ఇన్నాళ్లకు కప్‌ను ముద్దాడటంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. పటిష్టమైన సాన్ ఆంటోనియో జట్టుపై మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూయార్క్ నిక్స్, ఫైనల్ సిరీస్‌లో తిరుగులేని ఆటతీరుతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
న్యూయార్క్ నిక్స్ గెలుపుతో అమెరికాలోని న్యూయార్క్ వీధులు జనసంద్రంగా మారిపోయింది. న్యూయార్క్ నిక్స్ చాంపియన్‌గా నిలవడంతో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌స్క్వేర్ వద్ద వేల సంఖ్యలో గూమిగూడిన జనం సంబరాల్లో మునిగితేలారు.
అయితే ఈ వేడుకలు శ్రుతి మించాయి. కొందరు అభిమానులు బస్సులకు మంటలు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడంతో అల్లర్లు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు టైమ్‌స్క్వేర్ వద్ద జనాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
చదవండి: 90 నిమిషాల్లో 12 గోల్స్.. 71 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు! సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు) యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్..
Jun 14 2026 7:50 PM | Updated on Jun 14 2026 7:58 PM
బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం నమోదయ్యింది. న్యూయార్క్ నిక్స్ 53 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ నేషనల్ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ (ఎన్బీఏ) చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఎన్బీఏ చరిత్రలో న్యూయార్క్ నిక్స్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి.
శనివారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో న్యూయార్క్ నిక్స్ 94-90 తేడాతో సాన్ ఆంటోనియో జట్టుపై విజయం సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో మొదట సాన్ ఆంటోనియో ఆదిపత్యం చెలాయించగా, న్యూయార్క్ నిక్స్ ఆఖర్లో అద్భుతంగా ఫుంజుకోవడం విశేషం.
చివరిసారిగా 1973లో ఈ టైటిల్ గెలిచిన నిక్స్ జట్టు, మళ్లీ ఇన్నాళ్లకు కప్‌ను ముద్దాడటంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు మైదానంలో సంబరాల్లో మునిగిపోయారు. పటిష్టమైన సాన్ ఆంటోనియో జట్టుపై మొదటి నుంచీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన న్యూయార్క్ నిక్స్, ఫైనల్ సిరీస్‌లో తిరుగులేని ఆటతీరుతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది.
న్యూయార్క్ నిక్స్ గెలుపుతో అమెరికాలోని న్యూయార్క్ వీధులు జనసంద్రంగా మారిపోయింది. న్యూయార్క్ నిక్స్ చాంపియన్‌గా నిలవడంతో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌స్క్వేర్ వద్ద వేల సంఖ్యలో గూమిగూడిన జనం సంబరాల్లో మునిగితేలారు. అయితే ఈ వేడుకలు శ్రుతి మించాయి. కొందరు అభిమానులు బస్సులకు మంటలు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడంతో అల్లర్లు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు టైమ్‌స్క్వేర్ వద్ద జనాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
చదవండి: 90 నిమిషాల్లో 12 గోల్స్.. 71 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు!
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు)
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు)
కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు)
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21)
నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..?
కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన
బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది..
జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం
మోసం వెనుక అసలు కారణం..? కడప