
సాధారణంగా ఎవరికైనా రాత్రి వేళల్లో తమ ఇల్లే అత్యంత సురక్షితమైన ప్రదేశం. కానీ, తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కొండప్రాంతాల్లో ఉన్న మారుమూల గిరిజన గ్రామాల్లో మాత్రం చీకటి పడితే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటుంది. అడవి జంతువుల దాడికి భయపడి ఇళ్లల్లో నిద్రించడానికి జంకుతున్న గిరిజన కుటుంబాలు రక్షణ కోసం రాత్రి వేళల్లో చెట్లపైకెక్కి నిద్రిస్తున్నారు. కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణుల ముప్పు పెరుగుతుండటంతో ప్రభుత్వం స్పందించి తమకు శాశ్వత రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ వార్త చదివారా: రాజ్యసభలో 2/3 మెజారిటీ దిశగా ఎన్డీయే!