
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Peko And Kalp Collaboration: యూఏఈ వ్యాపార రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేచింది. దుబాయ్‌కు చెందిన ప్రముఖ ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ 'పెకో' (Peko)..
ప్రముఖ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోకనైజేషన్ టెక్నాలజీ సంస్థ 'కల్ప్' (Culp) చేతులు కలిపాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫైనాన్స్, వాణిజ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి.
దీనివల్ల సాధారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పరిమితమయ్యే ఏఐ (AI), స్మార్ట్ పేమెంట్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఇకపై చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. నేటి డిజిటల్ యుగంలో వ్యాపారంలో కేవలం మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంటే సరిపోదు.
వాటితో పాటు కింది సేవలు కూడా అంతే ముఖ్యంగా అవసరం దాపురించింది. ఇన్వాయిసింగ్, బిల్లింగ్, అకౌంటింగ్, టాక్స్, జీతాల నిర్వహణ, కస్టమర్ మేనేజ్మెంట్, లైసెన్సింగ్ వంటివి ప్రస్తుత కాలంలో అత్యవసరంగా మారాయి. పెద్ద కంపెనీలు ఈ పనుల కోసం ఖరీదైన సాఫ్ట్వేర్లను వాడుతుంటాయి.
కానీ చిన్న వ్యాపారాలకు (SMEs) అంత బడ్జెట్ ఉండదు. ఇక్కడే పెకో-కల్ప్ భాగస్వామ్యం చిన్న వ్యాపారాల పనిని మరింత సులభతరం, వేగవంతం, సురక్షితంగా మార్చబోతుంది. పెకో - కల్ప్ టెక్నాలజీ హైలైట్స్ ఈ ఒప్పందం ప్రకారం.. కల్ప్ సంస్థకు చెందిన అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెకో ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానిస్తారు.
సాయంతో మరింత సులభతరం చేయడంతో పాటు మరింత సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీల నిర్వహణ దీని బాధ్యత. అలాగే వేగవంతమైన వాల్యూ-మూవ్మెంట్ మౌలిక సదుపాయాలు.. సురక్షితమైన కీ-మేనేజ్మెంట్తో కూడిన టోకనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి కీలకం కానున్నాయి.
రెండు భిన్న శక్తుల కలయిక పెకో (Peko) అనే సంస్థ యూఏఈలో వ్యాపారాలకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లా పనిచేస్తోంది. బ్యాంకులు, ఫ్రీ జోన్లు, ప్రభుత్వ సంస్థలకు ఇన్వాయిసింగ్, పేరోల్, కార్పొరేట్ ట్రావెల్, ఇన్సూరెన్స్ వంటి 50కి పైగా సేవలను అందిస్తోంది.
మరోవైపు కల్ప్ (Culp) అనే సంస్థ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉండి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. భాగస్వామ్య కంపెనీలు తమ సొంత బ్రాండ్ పేరుతో అధునాతన డిజిటల్ ఫైనాన్స్ సేవలు అందించేలా బ్యాకెండ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.
కంపెనీల అధినేతలు ఏమన్నారంటే..? "మేము పెకోను నిర్మించినప్పుడు, కేవలం వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు. వాటి వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను సరికొత్తగా పునఃరూపకల్పన చేయడమే మా అసలు లక్ష్యం" అని పెకో ప్రతినిధి అహ్మద్ ఖాన్ అన్నారు.
"మాది 'ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్' నమూనా. అంటే కేవలం ప్రచారం కోసం ఒక వినియోగదారు బ్రాండ్‌గా నిలవడం మా ఉద్దేశం కాదు. నమ్మకమైన ప్లాట్‌ఫారమ్‌ల వెనుక ఉంటూ శక్తివంతమైన సాంకేతికతను అందించడమే మా లక్ష్యం. రాబోయే దశాబ్దంలో వ్యాపారాలు డబ్బును నిర్వహించే శైలి మారబోతోంది. ఆ మార్పును SMEలు లీడ్ చేసేలా చేయడమే మా ప్లాన్" కల్ప్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు తపన్ సంగల్ పేర్కొన్నారు.
ఒకప్పుడు కేవలం పెద్ద ఆర్థిక సంస్థలకే పరిమితమైన హై-ఎండ్ డిజిటల్ టెక్నాలజీని, సాధారణ వ్యాపారాలు కూడా రోజువారీగా ఉపయోగించుకునేలా చేయడమే ఈ డీల్ ముఖ్య ఉద్దేశం. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
దీని ద్వారా వ్యాపారాలకు కింది డిజిటల్ సేవలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)