
వేసవి వచ్చిందంటే చాలు, మామిడి పండ్ల రుచిని ఆస్వాదించని వారుండరు. అయితే, మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లను నేరుగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వాటి తొక్కలపై ఉండే పురుగుమందుల అవశేషాలు, మురికి, మైనం వంటివి శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ఇంట్లోనే అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో మామిడి పండ్లను సులభంగా, సహజంగా శుభ్రం చేసుకోవచ్చు.శుభ్రపరిచే సులభమైన పద్ధతులుముందుగా పండ్లపై ఉన్న స్టిక్కర్లను తీసేసి, పంపు కింద పెట్టి చేతులతో బాగా రుద్దుతూ కడగాలి. దీనివల్ల పైనున్న మురికి, మరకలు తొలగిపోతాయి. ఆ తర్వాత ఈ కింది పద్ధతుల్లో ఏదో ఒకటి పాటించడం ఉత్తమం.బేకింగ్ సోడా: ఒక లీటరు నీటిలో ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిలో మామిడి పండ్లను కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టాలి. బేకింగ్ సోడా పురుగుమందుల అవశేషాలను విచ్ఛిన్నం చేయడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఆ తర్వాత మంచి నీటితో మరోసారి కడగాలి.వైట్ వెనిగర్: ఒక వంతు వైట్ వెనిగర్‌కు తొమ్మిది పాళ్ల నీటిని కలిపి ఒక ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో మామిడి పండ్లను 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచి, ఆపై ఒక్కొక్కటిగా తీసి శుభ్రంగా కడగాలి. అయితే, బేకింగ్ సోడా, వెనిగర్‌ను కలిపి ఉపయోగించకూడదు.ఉప్పు నీరు: గోరువెచ్చని ఉప్పు నీటిలో మామిడి పండ్లను 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టి, ఆ తర్వాత పూర్తిగా కడిగేయడం కూడా మంచి పద్ధతి.చాలామంది తొక్క తినం కదా