
Prakash Raj: నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే, బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఆదివారం యువత ఆధ్వర్యంలో జరగనున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసన ప్రదర్శనకు ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ హాజరుకానున్నారు. Read also: Raj Thackeray: రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ముంబైలో బైకర్లకు లీటర్ పెట్రోల్‌పై రూ. 5తగ్గింపు యువత, విద్యార్థులు కలిసి చేపట్టిన ఈ వినూత్న నిరసనకు ప్రకాశ్ రాజ్ తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ పర్యటనపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు, శాంతియుత మార్గంలో సాగుతున్న ఈ పోరాటానికి నా మద్దతు అందించేందుకు బెంగళూరు వస్తున్నాను. దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఈ నిరసనలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వాన్ని బాధ్యులను చేద్దాం” అని పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రకాశ్ రాజ్, తన సృజనాత్మక హ్యాష్‌ట్యాగ్ #JustAsking తో ఈ ఉద్యమంలో భాగం కావడం ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యావ్యవస్థలో జరుగుతున్న అవకతవకలపై యువత నేతృత్వంలో ఏర్పాటైన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా నిరసన సెగలు రేపుతోంది. నీట్ పేపర్ లీకేజీలు, సీబీఎస్ఈ బోర్డు సమస్యలు, పరీక్షల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం వంటి తీవ్రమైన అంశాలపై ఈ సంస్థ పోరాడుతోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు పుణె, లక్నో, హైదరాబాద్ నగరాల్లో ఈ సంస్థ భారీ ఎత్తున నిరసనలు నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఆందోళనకు ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సైతం హాజరై
మద్దతు పలకడం విశేషం. చేతుల్లో భారత రాజ్యాంగం, జాతీయ జెండాలను పట్టుకుని.. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలంటూ శాంతియుత మార్గంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే తమ ముఖ్య ఉద్దేశమని ఈ ఉద్యమ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.
KTR Vs Revant : రేవంత్ ఆ పని చేస్తే రాజకీయం వదిలేస్తా..కేటీఆర్ సంచలన ప్రకటన
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Raj Thackeray: రాజ్ ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ముంబైలో బైకర్లకు లీటర్ పెట్రోల్‌పై రూ. 5తగ్గింపు
Gurbhej Singh: లండన్ లో భారత సంతతి యువకుడు దారుణ హత్య
Mallikarjun Kharge : ఖర్గే ..ఆరేళ్ల వయసులో దారుణం జరిగింది !!
Slipper Shot : అధికారిని చెప్పుతో కొట్టిన రైతు
Sanjay Raut: ప్రధాని మోదీని ఔరంగజేబుతో పోల్చిన సంజయ్ రౌత్
Ahmedabad Airport: విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం