
తులసికోట ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు దీపం వెలిగించాలి? ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయాలుతులసికోట ఎక్కడ పెట్టాలి? ఎప్పుడు దీపం వెలిగించాలి? ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన విషయాలు 14 June 2026 Rajashekher ఇంటి గుమ్మానికి ఎదురుగా తులసికోటను ఏర్పాటు చేయడం ఉత్తమం. లేకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎడమవైపు కనిపించేలా ఉంచవచ్చు. తులసికోట స్థానం.. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం వంటి ఏ దిశలోనైనా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ఏ దిశలో పెట్టినా తప్పు లేదు.. బాల్కనీ తూర్పు వైపు ఉంటే నైరుతి దిశలో, పడమర వైపు ఉంటే వాయవ్య దిశలో తులసికుండీని ఉంచడం శ్రేయస్కరం. అపార్ట్మెంట్లలో తులసి ఏర్పాటు.. నిత్యపూజలో పూలు లేనప్పుడు తులసి ఆకుల బదులుగా అక్షతలు వాడాలి. తులసి దళాలను ప్రధానంగా శ్రీమన్నారాయణుని అర్చనకే ఉపయోగించాలి. పూజలో తులసి ఆకుల వినియోగం.. స్త్రీలు తులసి ఆకులు లేదా గింజలు తెంపకూడదనే సంప్రదాయం ఉంది. అయితే పొరపాటున తెంపితే ఎలాంటి దోషం లేదా అశుభం ఉండదని పండితులు చెబుతున్నారు. స్త్రీలు తులసి ఆకులు కోయకూడదనే ఆచారం మట్టి నాణ్యత, నీటి కొరత, ఎండ లేకపోవడం, ఇతర మొక్కల ప్రభావం వంటి కారణాల వల్ల తులసి మొక్క వాడిపోవచ్చు. ఇది అశుభానికి సంకేతం కాదని చెబుతున్నారు. తులసి మొక్క ఎండిపోతే అశుభం కాదు.. ప్రతిరోజూ సాయంత్రం సూర్యాస్తమయానికి ముందే తులసికోట వద్ద దీపం వెలిగించాలి. దీనిని "సంధ్యాదీపం" అని పిలుస్తారు. తులసికోటలో దీపం వెలిగించే సమయం.. లక్ష్మీ (శ్రీ తులసి), రామ తులసి, కృష్ణ/శ్యామ తులసి అనే రకాలు ఉన్నాయి. వీటిలో ఏదైనా పెంచుకోవచ్చు. లక్ష్మీ తులసి లక్ష్మీదేవి అనుగ్రహానికి, రామ తులసి పూజలకు, కృష్ణ తులసి ఆయుర్వేద వినియోగానికి ప్రసిద్ధి. ఇంట్లో ఏ రకం తులసి పెంచుకోవాలి?.. తులసి మొక్కలు లేదా వాటి విత్తనాలను ఇతరులకు ఇవ్వడం శుభప్రదమే. ఇలా
చేయడం వల్ల ఇంటి లక్ష్మి బయటకు వెళ్లిపోతుందనే నమ్మకానికి ఎలాంటి ఆధారం లేదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను ఇతరులకు ఇవ్వవచ్చా?.. మరిన్ని వెబ్ స్టోరీస్ దానిమ్మ ఆరోగ్యానికి వరమే.. కానీ, ఈ రోగులకు మాత్రం శాపం! – ఈ దిశలో మందార మొక్కను నాటితే ఐశ్వర్యం మీ వెంటే! బొప్పాయి అమృతమే..కానీ, వీళ్లు తిన్నారంటే కష్టమే!