
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Four washed away after boat capsizes in palnadu krishna river: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా నదుల్లోకి స్నానాలకని వెళ్లిన వారు గల్లంతైన విషాద ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నయి. అప్పటి వరకు బాగానే తమ కుటుంబం, బంధువులతో ఎంజాయ్ చేసిన వారంతా ఒక్కసారిగా విషాద ఘటనల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా.. ఆంధ్ర ప్రదేశ్ లోని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా తమ బంధువుల ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన కొందరు వ్యక్తులు నదిలో చిన్న పడవలో విహారయాత్రకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వస్తుండగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బలమైన అలలు, ఎదురు గాలి రావడంతో పది మందితో ప్రయాణిస్తున్న పడవ కాస్త ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం పదిమంది నీటిలో పడిపోయారు. వెంటనే వీరిని గమనించిన స్థానికులు నీళ్లలోకి దూకి వెంటనే ఆరుగురిని సురక్షితంగా కాపాడారు. కానీ అప్పటికే నీటి ప్రవాహంలో నలుగురు కొట్టుకుని పోయారు. దీంతో స్థానికులు గజఈతగాళ్లు , పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ముగ్గురి డెడ్ బాడీలను గజ ఈతగాళ్లు గుర్తించారు. గల్లంతైన వారిలో.. గంధం సంధ్య (9), గంధం సైనీ(10), బత్తుల కార్తీక్ (12) చైతన్య (28) గా గుర్తించారు. వీరిలో ముగ్గురు చనిపోయారు. మరోకరి కోసం రెస్క్యూ గాలింపును చర్యలు చేపట్టింది. విహర యాత్ర కాస్త ఈ విధంగా విషాద యాత్రగా మారడంతో గల్లంతైన కుటుంబ సభ్యులు అంతా గుండెలవిసేలా రోదిస్తున్నారు. Read more: జూన్ 25
నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.