టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ , రష్మిక మందానా వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రియల్ హీరోలనిపించుకున్నారు. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట, తమ ఉదారతతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. గతంలో తమ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన ఓ పూజా కార్యక్రమం సందర్భంగా సమాజానికి ఉపయోగపడే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటామని ప్రకటించిన ఈ నూతన దంపతులు.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు.* అనిల్ రావిపూడి నాకు అందుకే మళ్లీ ఛాన్స్ ఇవ్వడం లేదేమో – ఐశ్వర్య రాజేష్విజయ్ దేవరకొండ తన తండ్రి స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లాలోని తుమ్మన్‌పేట గ్రామానికి తన భార్య రష్మికతో కలిసి విచ్చేశారు. వివాహం అనంతరం మొదటిసారిగా ఈ జంట తమ సొంత గ్రామానికి రావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా వారు కేవలం గ్రామాన్ని సందర్శించడమే కాకుండా, అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలిచేలా ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ ది దేవరకొండ ఫౌండేషన్ ’ ద్వారా అచ్చంపేట మండలం పరిధిలోని సుమారు 44 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9, 10వ తరగతి విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ఈ దంపతులు అధికారికంగా ప్రారంభించారు. విద్యాసంవత్సరంలో కష్టపడి చదివి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది మెరిట్ విద్యార్థుల జాబితాను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.* రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై ఆర్జీవీ కన్ను.. సరికొత్త క్రైమ్ డ్రామాకు స్కెచ్! ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందడుగు వేసినట్లు వారు తెలిపారు. ఎంపికైన ఈ 180 మంది పిల్లల ఉన్నత చదువులకు అయ్యే పూర్తి బాధ్యతను, ఖర్చులను తామే భరిస్తామని విజయ్-రష్మిక దంపతులు హామీ ఇచ్చారు. తమ ప్రయాణానికి సంబంధించిన వివరాలను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ
.. "మా నాన్నగారు పుట్టిన తుమ్మన్‌పేట గ్రామానికి మేము ప్రయాణమయ్యాం. గత ఫిబ్రవరి నెలలో రష్మిక, నేను కలిసి కన్న ఒక చిన్న కలను ఇప్పుడు నిజం చేస్తున్నాము. అచ్చంపేట మండలానికి చెందిన ఎంతో మంది కష్టపడే విద్యార్థులను సత్కరించడమే మా లక్ష్యం. తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేసిన 180 మంది ప్రతిభావంతులైన పిల్లల జాబితా ఇదిగో" అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ఈ క్రేజీ స్టార్స్ తీసుకున్న నిర్ణయంపై అటు గ్రామస్థులతో పాటు ఇటు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.