
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం జరిగిన తొలి వన్డేలో గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 3 000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్థాన్‌తో శనివారం జరిగిన తొలి వన్డేలో గిల్ వన్డేల్లో అత్యంత వేగంగా 3 000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డుకెక్కాడు. కేవలం 62 ఇన్నింగ్స్‌ల్లోనే అతను ఈ ఘనత సాధించి శిఖర్ ధావన్ (72 ఇన్నింగ్స్‌లు), విరాట్ కోహ్లి (75 ఇన్నింగ్స్‌లు) రికార్డులను అధిగమించాడు. ఈ ఫీట్ విషయంలో ఓవరాల్‌గా సౌతాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా తొలిస్థానంలో ఉన్నాడు. అతడు 57 ఇన్నింగ్స్‌లలో 3 వేల పరుగులు చేశాడు. అతడి తర్వాత అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ . అఫ్గానిస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (51 బంతుల్లో 102 పరుగులు) సెంచరీతో చెలరేగాడు. చివరకు ఆ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. భారత అరంగేట్ర బౌలర్లు గుర్నూర్ బ్రార్ , హర్ష్ దూబే చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. గిల్ (66 బంతుల్లో 84 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌కు తోడు లోకేశ్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) మెరుపులు జోడించడంతో 22.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. బుధవారం లఖ్‌నవూలో రెండో వన్డే జరగనుంది. రోహిత్ శర్మ రనౌట్‌పై స్పందించిన శుభ్‌మన్
గిల్
అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్ మీట్‌ను మధ్యలో ఆపేసిన నితీశ్‌కుమార్ రెడ్డి