టాలీవుడ్లో తనదైన నటన, విలక్షణమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ . గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా వైవిధ్యమైన కంటెంట్ ఆధారిత చిత్రాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ సుకుమారి’ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఐశ్వర్య రాజేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, హిట్స్, అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తమిళంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఐశ్వర్య రాజేష్.. 2019లో వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’ అనే మహిళా ప్రాధాన్య చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో మహిళా క్రికెటర్‌గా ఆమె చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ చిత్రంలో 'సువర్ణ' అనే ఒక సాదాసీదా మధ్యతరగతి గృహిణి పాత్రలో ఒదిగిపోయి తెలుగు వారి హృదయాలను గెలుచుకున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీలో కీలక పాత్రలో నటించింది. గతేడాది విక్టరీ వెంకటేష్ సరసన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో భాగ్యలక్ష్మిగా నటించి, తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌ను దక్కించుకుంది.* రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసుపై ఆర్జీవీ కన్ను.. సరికొత్త క్రైమ్ డ్రామాకు స్కెచ్! ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అంతటి భారీ విజయం సాధించడంలో ఐశ్వర్య రాజేష్ పాత్ర కూడా కీలకమని చాలామంది ప్రశంసించారు. అయితే ఆ తర్వాత అనిల్ రావిపూడి తన సినిమాల్లో ఐశ్వర్యకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? అనే ప్రశ్న ఈ ఈవెంట్లో ఎదురైంది. దీనికి ఐశ్వర్య రాజేష్ తనదైన శైలిలో స్పందిస్తూ.. "మీ దగ్గర అనిల్ గారి నెంబర్ ఉందా? ఉంటే వెంటనే ఫోన్ చేసి అడుగుదాం" అంటూ సరదాగా
నవ్వులు పూయించారు. ఆపై మాట్లాడుతూ.. "ఈ ప్రశ్న నన్ను చాలామంది అడుగుతున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం అంత పెద్ద సక్సెస్ కావడంలో నా వాటా చాలా ఎక్కువ ఉంటుందని అనిల్ గారు కూడా అనేక సందర్భాల్లో నాతో చెప్పారు. ఆయన ఆ సినిమా తర్వాత నాకు వెంటనే అవకాశం ఇవ్వకపోవడానికి కారణం.. నాకోసం మరింత అద్భుతమైన, వైవిధ్యమైన పాత్ర కోసం ఆయన ఆలోచిస్తూ ఉండవచ్చు" అని చాలా పాజిటివ్‌గా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ – నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో ఒక క్రేజీ మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారని, ఆ చిత్ర కథ తనకు తెలుసని, ఆ సినిమాతో అనిల్ రావిపూడి మరో మైండ్‌బ్లోయింగ్ బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయమని నమ్మకంగా చెప్పారు.* ప్రభాస్‌తో బాలీవుడ్ సెన్సేషన్ ఆదిత్య ధర్ మైండ్ బ్లాంక్ కాంబో.. బాక్సాఫీస్‌కి ఊచకోతే! కరెంట్ షాక్ కొట్టించే ‘ఓ సుకుమారి’ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్, టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించి లేటెస్ట్ పల్లెటూరి రొమాంటిక్ కామెడీ చిత్రం ‘ఓ సుకుమారి’. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ దామిని అనే టైటిల్ రోల్ పోషిస్తున్నారు. పేరుకు సుకుమారి అయినప్పటికీ.. ఆమెను ఎవరైనా తాకితే చాలు అవతలి వారికి విపరీతమైన కరెంట్ షాక్ కొట్టే ఒక విచిత్రమైన సమస్యతో ఈ క్యారెక్టర్ సాగనుంది. అలాగే తిరువీర్ ఇందులో 'యాది' అనే పల్లెటూరి రాజకీయ నాయకుడిగా నటిస్తున్నారు. నిన్న విడుదలైన ఈ చిత్ర టీజర్ సరికొత్త హాస్యంతో, అలరించే ఎలిమెంట్స్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.