
హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం నాలుగు రోజుల వ్యవధిలో నలుగురిని బలితీసుకుంది. భారీ వర్షాల కారణంగా చెట్లు విరిగిపడి.. విద్యుత్ తీగలు తెగిపడటంతో పాతబస్తీలో ఇద్దరు యువకులు, సికింద్రాబాద్ అల్వాల్లో తండ్రీకుమార్తెలు మృతిచెందారు. విద్యుత్ తీగలు వేలాడుతున్నాయని.. జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న వేలాది ఫిర్యాదులు అధికారుల పనితీరుకు అద్దంపడుతున్నాయి. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సమాధానం చెప్పలేక మొక్కుబడిగా చెట్ల కొమ్మలు, విద్యుత్ వైర్లు తొలగిస్తూ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ఈ వీడియో చూశారా: జోరువానలు.. పొంగుతున్న వాగులు