
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకూ క్రీజ్‌లో నిలిచి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది. అయితే, ఇప్పుడు తన ఆటతీరుపై కాకుండా.. రోహిత్ శర్మ రనౌట్ కావడంతో గిల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. స్ట్రైకింగ్‌లోని బ్యాటర్ పిలుస్తున్నా.. నాన్స్ట్రైకర్లోని గిల్ వెళ్లలేదు. దీంతో రోహిత్ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ అనంతరం గిల్ ఈ ఘటనపై స్పందించాడు. అలాగే యువ ఆటగాళ్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే బౌలింగ్‌పై ప్రశంసలు కురిపించాడు. గుర్నూర్ పేస్ చాలా బాగుంది. నిలకడగా లైన్ అండ్ లెంగ్త్‌తో బంతిని సంధించాడు. స్వింగ్ కూడా మెరుగ్గా ఉంది. ఇక హర్ష్ దూబే తన తొలి ఓవర్లోనే 16 పరుగులు ఇచ్చినా.. తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. ఇది టీ20 మ్యాచ్‌లా భావించాం. మిడిల్, డెత్ ఓవర్లలోనూ మెరుగైన బౌలింగ్ చేయగలిగాం. రోహిత్ శర్మ రనౌట్ కావడం దురదృష్టకరం. ఆ సమయంలో చాలా నిరాశకు గురయ్యాడు. అయితే, డగౌట్‌కు వెళ్లాక.. రిప్లే చూశాడు. ఓకే ఫర్వాలేదులే అని నాతో అన్నాడు. గతంలోనూ అఫ్గాన్‌తో టీ20 ఆడినప్పుడు కూడా ఇలానే రోహిత్ రనౌట్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ కావడం నిజంగా అన్లక్కీనే. కచ్చితంగా బంతిని అందుకుంటాననే నమ్మకంతోనే ఉన్నా. స్లిప్‌లో క్యాచులు పట్టడం కష్టమే. అందుకోసం చాలా శ్రమించా. మ్యాచ్‌కు ముందు కూడా ప్రాక్టీస్ చేశా. ఒంటి చేత్తో క్యాచ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాచ్‌పై నా స్నేహితుడితో మాట్లాడా. ఇదే నా అంతర్జాతీయ కెరీర్లో అద్భుతమైన క్యాచ్ అనడంలో సందేహం లేదు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా
సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.