
టెక్నాలజీ ప్రపంచంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే ఎలాన్ మస్క్, ఇప్పుడు ప్రపంచ చరిత్రలోనే ఒక అపూర్వమైన మైలురాయిని చేరుకున్నారు. తన అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ పబ్లిక్‌గా ట్రేడ్ అవ్వడంతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించారు. అయితే ఇంతటి అపార సంపద ఉన్నప్పటికీ, ఆయన వ్యక్తిగత జీవనశైలి మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అత్యంత నిరాడంబరంగా ఒక చిన్న ఇంట్లో ఇంట్లో ఆయన నివసిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.స్పేస్ఎక్స్ ఐపీఓతో మారిన భవిష్యత్తుఇటీవల స్పేస్ఎక్స్ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా సుమారు 75 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఒక్కో షేరును 135 డాలర్లకు విక్రయించడంతో, కంపెనీ మార్కెట్ విలువ ఏకంగా 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఆ తర్వాత రోజు ట్రేడింగ్‌లో షేరు విలువ దాదాపు 20 శాతం పెరిగి 162 డాలర్లకు చేరుకుంది. దీంతో స్పేస్ఎక్స్, టెస్లా కంపెనీలలో మస్క్‌కు ఉన్న వాటాలను కలుపుకుంటే, ఆయన నికర సంపద ట్రిలియన్ డాలర్ల మార్కును దాటింది.50,000 డాలర్ల ఇంట్లో జీవనంలక్షల కోట్ల సంపదకు అధిపతి అయినా, మస్క్ ప్రధాన నివాసం టెక్సాస్‌లోని బోకాచికాలో స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ సమీపంలో ఉన్న ఒక చిన్న ప్రీఫ్యాబ్రికేటెడ్ ఇల్లు. ఫార్చ్యూన్ మ్యాగజైన్ కథనం ప్రకారం ఈ ఇంటి విలువ కేవలం 50,000 డాలర్లు (దాదాపు రూ.40 లక్షలు) మాత్రమే. 2020లో టెక్సాస్‌కు మారిన తర్వాత మస్క్ కాలిఫోర్నియాలోని తన విలాసవంతమైన ఆస్తులన్నింటినీ అమ్మేశారు. "నా ప్రధాన నివాసం స్పేస్ఎక్స్ నుంచి అద్దెకు తీసుకున్న 50,000 డాలర్ల