
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Dwidasha Yoga 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల ప్రత్యేక కలయిక జరిగినప్పుడు.. ఆ సమయంలోనే శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి.
ఇలా ఏర్పడిన రాజయోగాలు తప్పకుండా మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి.. ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ద్విదశ యోగం కూడా ఏర్పడుతుంది. ఇదిలా ఉంటే జూన్ 14వ తేదీన ఈ యోగం ఏర్పడింది. దీనిని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవిత్రమైన యోగంగా పరిగణిస్తారు.
చంద్రుడు మేషరాశిని వదిలి.. ఉచ్చరాశిగా భావించే వృషభంలోకి సంచారం చేసినప్పుడు ఈ యోగం ఏర్పడింది.. జూన్ 14వ తేదీన 9 గంటల వరకు అదే రాశిలో చంద్రుడు కొనసాగుతూ ఉంటాడు. ఇదే సమయంలో బుధుడు తన సొంత రాశిగా భావించే మిథునంలోకి ప్రవేశించడం వల్ల, చంద్రుడు బుధులు అరుదైన కలయికతో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో వరించబోతోంది అంతేకాకుండా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.
వ్యాపారాలు కూడా చాలావరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశులవారికి బంపర్ లాభాలు: వృషభ రాశి చంద్రుడు ఇదే రాశుల ఉండడం కారణంగా వృషభ రాశి వారికి ఈ సమయం ఒక వరం కంటే ఎక్కువగా భావించవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది.
అలాగే పనుల్లో అద్భుతమైన శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో కీర్తి, ప్రతిష్టలతో పాటు గౌరవం
కూడా విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
మిథున రాశి సొంత రాశిలో బుధుడు ఉండడం కారణంగా వీరిపై కూడా ద్విదశ యోగ ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి అలాగే స్థిరమైన ధన ప్రవాహం కూడా లభించి ఊహించని లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు అద్భుతమైన పదోన్నతులు పొంది.. జీతాలు కూడా భారీగా పెంచుకోగలుగుతారు. గతంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం లభించి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది..
కన్య రాశి చంద్ర-బుధ గ్రహాల సంయోగం కారణంగా కన్య రాశి వారికి మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది. కొంతకాలంగా మనసులో ఉన్న మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం తోడు లభించి.. విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలాలు లభించే అవకాశాలున్నాయి. కార్యాలయంలో అధికారులు మీపై హర్షం కూడా వ్యక్తం చేస్తారు..
తులారాశి తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆనందంతో పాటు సానుకూల ప్రయోజనాలు పొందగలుగుతారు. అంతేకాకుండా మనసు కూడా చాలా ఉల్లాసంగా మారుతుంది.. అన్ని విషయాల్లో మీ కుటుంబ సభ్యులతో పాటు ప్రియమైన వారి సపోర్టు లభించి.. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. మానసిక ఉపశమనం లభించడమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి..
మీన రాశి మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు శని ప్రభావం నడుస్తున్నప్పటికీ చంద్రుడి ప్రభావంతో కొంత ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలనుంచి విముక్తి పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.