
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి. ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది. ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు.. అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం
Jun 14 2026 10:17 AM | Updated on Jun 14 2026 10:30 AM
తమిళనాడు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి, పార్టీ పెట్టిన రెండేళ్లకే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టార్ హీరో విజయ్. ఆయన ఇటీవలే కర్ణాటకలోని కొల్లూరు శ్రీ మూకాంబికా అమ్మవారిని సందర్శించుకుని పూజలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ముఖ్యమంత్రి హోదాలో తమిళనాడు ఆలయాన్ని ఎందరో దర్శించుకున్నారు. అంతేగాదు సెలబ్రిటీలు, ప్రముఖులు సైతం ఈ ఆలయానికే తరలి వస్తుంటారు. మన టాలీవుడ్ హీరో ఎన్టీర్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సంగీత మాంత్రికుడు ఇళయరాజా వంటి దిగ్గజాలు వరకు చాలామంది ఈ అమ్మవారిని దర్శించుకుని, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రులు ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అంతా ఈ అమ్మవారిని దర్శించుకున్నారు. అలా అంతటి అతిరథమహారథులంతా తరలివస్తున్న ఈ కొల్లూరు మూకాంబిక క్షేత్రం విశిష్టత ఏంటి, ఎందుకు రాజకీయ నాయకులు దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఈ అమ్మ దర్శనానికి బారులు తీరుతున్నారు వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందామా.!.
కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబికా దేవాలయం.. దక్షిణాదిన ప్రసిద్ధ శక్తి పీఠాల్లో ఒకటి. పార్వతీదేవి ఇక్కడ మూకాంబికాగా పూజలందుకుంటోంది. దీన్ని పరశురాముడు సృష్టించిన ఏడు మోక్ష క్షేత్రాల్లో ఒకటిగా స్థానిక పురాణాలు పేర్కొంటున్నాయి.
ఆకుపచ్చని పశ్చిమ కనుమల్లో వెలిసిందీ ఆలయం. ఇక్కడి అమ్మవారి విగ్రహం.. బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసం అనే అయిదు పంచలోహాల సమ్మేళనంతో రూపొందింది. మూకాంబికా దేవిని మాట, అక్షరం, విద్యకు సంబంధించిన శక్తిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే విద్యాభ్యాసం ప్రారంభించే పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చే సంప్రదాయం కూడా ఉంది.
ఎంజీఆర్ టు అమ్మ జయలిలత వరకు.. అంతేగాదు 1200 ఏళ్ల చరిత్ర కలిగిన కొల్లూరు మూకాంబిక ఆలయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రులు దర్శించుకుని, ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా మారింది. గతంలో ఎంజీ రామచంద్రన్ ఈ అమ్మవారిని దర్శించుకుని బంగారు కత్తిని కానుకగా అందజేశారు. ఆయన భార్య జానకీ రామచంద్రన్ కూడా సీఎం అయిన తర్వాత ఇక్కడకు వచ్చారు. అలాగే, ‘అమ్మ’ జయలలిత కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
జులై 30, 2004లో కొల్లూరు నూకాంబిక ఆలయంలో ప్రత్యేకంగా చండీయాగం కూడా జరిపించి, అన్నదానం కోసం రూ. 30,000లను జయలలిత సమర్పించారు. ఇక, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గ కూడా ఎన్నికలకు ముందు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. వారి బాటలోనే ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సైతం ఈ అమ్మవారిని దర్శించుకుని వెండి ఖడ్గాన్ని సమర్పించారు.
ఆలయ చరిత్ర.. పురాణాల ప్రకారం.. ఈ ప్రాంతాన్ని పాలించిన కౌమాసురుడనే రాక్షసుడు తనకు మరణం లేకుండా వరం పొందడానికి శివుడి కోసం తపస్సు చేశాడట. తన మనోబలంతో ఆ రాక్షసుడి కోరికను పసిగట్టిన కోల మహర్షి.. సరస్వతికి తెలియజేయడంతో శివుడు ప్రత్యక్షమయ్యే సమయంలో అతడ్ని అమ్మవారు మూగవాడిని చేసిందట. అప్పటి నుంచి అతడ్ని మూసాసురుడిగా పిలిచేవారు.
అయినప్పటికీ అతడు గర్వం వీడకపోగా.. దేవతలను, యక్షులను హింసించేవాడట. తననే పూజించాలని హుకుం జారీచేసి.. యజ్ఞయాగాదులను కూడా అడ్డుకోవడంతో కోల మహర్షి ఆధ్వరంలో మునులు పార్వతిదేవి వద్దకు వెళ్లి తమ కష్టాలను చెప్పుకున్నారు. దీంతో అమ్మవారు దైవగణాలతో వచ్చి ఆ మూసాసురుడిని సంహరించింది.
ఇది జరిగిన కొన్నాళ్ల తర్వాత ఆది శంకరాచార్యులు కుడజాద్రి కొండలలో ధ్యానం చేస్తున్న సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగిందట. దీనికి శంకరాచార్యులు.. కేరళలోని తాను చెప్పిన చోట వెలిసి పూజలు అందుకోవాలని, తద్వారా ఆ ప్రాంతం సుభిక్షమవుతుందని, ఆలయాన్ని దర్శించుకునే వారికి ఎన్నుకున్న రంగంలో విజయం సిద్ధించేలా వరాలు ఇవ్వాలని కోరారట.
ఇందుకు సరేనన్న అమ్మవారు.. ముందుగా శంకరాచార్యులను నడవమని, తర్వాత వెనుకగా వస్తాని, గమ్యం చేరే వరకూ తిరిగి చూడొద్దని చెప్పిందట. అలా మూకాసురుడ్ని వధించిన ప్రాంతానికి వచ్చేసరికి దేవి ఆగిపోయిందట. అమ్మవారి గజ్జల శబ్దం వినబడకపోవడంతో శంకరాచార్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడే మూకాంబికగా వెలిసిందట.
దీంతో నిరాశకు గురైన శంకరాచార్యలకు అమ్మవారు తన విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పడంతో ఆయన అలాగే చేశారని అంటారు. అమ్మవారి మొట్టమొదటి స్థానం కోడచాద్రి శిఖరంపై ఉండేదని.. కానీ అక్కడకు వెళ్లడం భక్తులకు కష్టంగా ఉండటంతో శంకరాచర్య ఆలయాన్ని కొల్లూరులో తిరిగి ప్రతిష్ఠించారని చెబుతుంటారు స్థానికులు.
అంతేగాదు ఆదిశంకరాచార్యులు స్వయంగా ఇక్కడ తపస్సు చేసి, అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఆయనే ఇక్కడ స్వయంభూ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ లింగం మధ్యలో ఒక 'స్వర్ణ రేఖ' ఉంటుంది. ఇది శివశక్తుల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. అంటే ఒకే క్షేత్రంలో అటు పరమశివుడిని, ఇటు పరాశక్తిని కలిపి దర్శించుకునే అరుదైన భాగ్యం భక్తులకు ఇక్కడ కలుగుతుంది.
ఈ అమ్మ ఆసీస్సుల కోసమే ఎందుకంటే.. ఈ మూకాంబికా అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే, తమ కెరీర్ అద్భుతంగా రాణిస్తుందని, విజయాలు వరిస్తాయని ఇండస్ట్రీ వర్గాల గట్టి నమ్మకం. అందుకే ముఖ్యమైన సినిమాలు ప్రారంభించే ముందు లేదా రాజకీయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ప్రముఖులు ఇక్కడికి రావడం ఆనవాయితీగా మారింది. అంతేగాదు ఈ అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిగా (లక్ష్మి, సరస్వతి, కాళీ స్వరూపిణిగా) భక్తులు విశ్వసిస్తారు.
ఆ నేపథ్యంలోనే రాజకీయ నాయకులు ఎన్నికల్లో జయాలు సాధించిన తర్వాత, తమ పదవికి, ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా పరిపాలన సాగాలని కోరుకుంటూ ఇక్కడ ప్రత్యేక పూజలు, చండీ యాగం వంటివి నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి ఒడిలో, సౌపర్ణిక నది తీరాన వెలసిన కొల్లూరు క్షేత్రం అటు ఆధ్యాత్మిక ప్రశాంతతను, ఇటు మానసిక ప్రశాంతతను ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం. అందుకే సామాన్య భక్తుల నుంచి కోట్లాది మంది అభిమానులు ఉన్న సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి పాద చెంతకు చేరుకుంటున్నారు.
Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14-21)
మూడు ముళ్ల బంధానికి పద్నాలుగేళ్లు..ముచ్చటగా ముగ్గురు పిల్లలు (ఫోటోలు)
ఆకట్టుకున్న యుద్ధ విమానాల విన్యాసాలు (ఫొటోలు)
పచ్చని కొండల్లో శ్రీలీల జాలీ ట్రిప్ (ఫొటోలు)
అంతన్నాడు ఇంతన్నాడే చంద్రబాబు.. బాబు పై అద్భుతమైన పాటపాడిన మహిళలు
బాబోయ్ అంత పెట్టలేమండీ బయటపడ్డ సంచలన ఆడియో
పాకిస్తాన్ తో భారత్ ఫైట్.. T20 ప్రపంచ కప్ వేట
ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో కూటమి రంగం సిద్ధం
మా ఆశలు.. ఆవిరి కుక్క మృతిపై మూడు అనుమానాలు అసలేం జరుగుతోంది