
ఎల్లారెడ్డిపేట, జూన్ 14: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్)పై తురక కాశీలకు అవగాహన కల్పించాలని తెలంగాణ తుర్క కాశ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యులైన తుర్క కాశీలకు సర్పై అవగాహన ఉండదని దీంతో తమ ఓట్లను కోల్పోయే ప్రమాదముందని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఎన్నికల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు వారి కాలనీలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓటరు నమోదు, మ్యాపింగ్, క్లెయిమ్ లు, అభ్యంతరాల దాఖలు పై వివరించాలన్నారు
.