
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. FIFA World Cup 2026: ఫీఫా వరల్డ్ కప్ 2026లోని గ్రూప్ సి 7వ గ్రూప్ దశ మ్యాచ్ న్యూయార్క్‌లోని న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్, మొరాకో మధ్య జరిగిన ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. నిర్ణీత 90 నిమిషాల ఆట తర్వాత.. రిఫరీ మరో 10 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయించారు. అయినప్పటికీ.. ఏ జట్టు కూడా తమ రెండవ గోల్‌ను సాధించలేకపోయింది. ఫలితంగా మ్యాచ్ 1-1 డ్రాగా ముగిసింది. ఇరు జట్లు 1-1 పాయింట్లతో తమ ఖాతాను తెరిచాయి. ఇరు జట్లు మ్యాచ్‌ను దూకుడుగా ప్రారంభించినప్పటికీ.. మొరాకో తొలి గోల్ చేసింది. 21వ నిమిషంలో మొరాకో ఆటగాడు బ్రాహిమ్ డియాజ్ బ్రెజిల్ డిఫెండర్లను తప్పించుకుంటూ ఒక అద్భుతమైన పాస్ అందించాడు. ఇస్మాయిల్ స్బిబారి పాస్‌ను అందుకోవడానికి వేగంగా పరుగెత్తి, బ్రెజిలియన్ గోల్ కీపర్ అలిసన్‌ను తప్పించుకున్న తర్వాత.. బంతిని గోల్ పోస్ట్‌లోకి చిప్ చేశాడు. ఈ అద్భుతమైన గోల్ మొరాకోకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చింది. మొరాకో చేతిలో ఒక గోల్ వెనుకంజలో ఉన్న తర్వాత, బ్రెజిల్ వెంటనే పుంజుకుంది. 32వ నిమిషంలో, బ్రూనో గిమారెస్ చక్కగా బంతిని వినిసియస్ జూనియర్‌కు అందించాడు. జూనియర్ బంతిని కంట్రోల్ చేసి వేగంగా పరుగెత్తి, తన కుడికాలుతో పవర్ ఫుల్ షాట్ కొట్టి బ్రెజిల్‌కు మొదటి గోల్‌ను అందించాడు. సెకండ్ హాఫ్ తర్వాత, ఆధిక్యం సాధించడానికి మొరాకో.. బ్రెజిల్ రెండూ సెకండ్ గోల్ చేయాలని చూశాయి. సెకండ్ హాఫ్ లో బ్రెజిల్ బంతిని తమ ఆధీనంలో ఉంచుకుని.. గోల్ చేయడానికి అవకాశాల కోసం చూసింది. కానీ మొరాకో కూడా ఏమాత్రం తడబడలేదు. అలర్ట్ గా ఉంటూ
ఎదురుదాడికి దిగారు. దీంతో మ్యాచ్ చివరి క్షణాల్లో విజయాన్ని ఖాయం చేసుకోవడానికి బ్రెజిల్ కోచ్ కార్లో అన్సెలోట్టి కీలక మార్పులు చేశారు. గోల్ చేసేందుకు మార్గం వెతుక్కునేందుకు ఆయన కొంతమంది కొత్త ఆటగాళ్లను రంగంలోకి దించారు. కానీ మొరాకో స్ట్రాటజీ ముందు వారందరూ విఫలమయ్యారు.
ఈ మ్యాచ్ లో బంతి 54 శాతం బ్రెజిల్ కంట్రోల్లోనే ఉన్నా వెతుక్కుంటూ వచ్చిన ఛాన్సులు ఆ జట్టు వినియోగించుకోలేదు. టార్గెట్ దిశగా బ్రెజిల్ ఆటగాళ్లు 5 సార్లు, మొరాకో ఆటగాళ్లు 4 సార్లు షాట్స్ కొట్టారు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో బ్రెజిల్ కు బిగ్ షాక్ తగిలినట్లే అని చెప్పాలి. ఎందుకంటే 1934 నుంచి జరిగిన సాకర్ వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచుల్లో ఆ జట్టు ప్రతీదాంట్లో నెగ్గుకుంటూ వచ్చింది. మొత్తం 17 సార్లు తన తొలి మ్యాచుల్లో సాంబా జట్టు విజయం సాధించింది. మరోవైపు ఈ మ్యాచులో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్ మార్ లేకపోవడంతో కూడా ఆ జట్టు బలాన్ని దెబ్బతీసిందని చెప్పాలి.
ఇక బ్రెజిల్ జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 20న హైతీతో, జూన్ 25న స్కాట్లాండ్తో జరగనుండగా, మొరాకో జట్టు తదుపరి మ్యాచ్ జూన్ 20న స్కాట్లాండ్తో, జూన్ 25న హైతీతో జరగనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.