
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana Paddy Procurement: తెలంగాణ విభజనకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంది. విభజనకు ముందు కరువు నేల.. వలస ప్రాంతం.. గంజికి దిక్కు లేని ప్రాంతంగా తెలంగాణ గుర్తింపు పొందింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణగా మారింది. అన్నీ రంగాల్లో అద్భుతమైన రాష్ట్రంగా గుర్తింపు పొందుతున్న తెలంగాణ రాష్ట్రం... వ్యవసాయంలో ఆల్‌టైమ్ రికార్డులు నమోదు చేస్తోంది. పంటల్లో సరికొత్త రికార్డులు సాధిస్తోంది. వరి ఉత్పత్తిలో దేశంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేసి నంబర్‌వన్‌గా నిలిచింది. స్వరాష్ట్రం ఏర్పడిన అనంతరం తెలంగాణ వ్యవసాయంలో అద్బుతాలు చేస్తోంది. అన్నమో రామచంద్ర అనే స్థాయి నుంచి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. ఈ ఏడాది కూడా తెలంగాణ వరి ఉత్పత్తిలో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. దేశంలో ఏ రాష్ట్రంలో సాధించని వరి ధాన్యం ఉత్పత్తి తెలంగాణలో జరిగింది. 2025-26 సంవత్సరంలో 150 లక్షల టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసిన ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితో వరి కొనుగోళ్లను చకచకా పూర్తి చేసింది. వర్షాకాలం కూడా ప్రారంభమవడంతో వరి సేకరణను వేగం పెంచింది. వరి కొనుగోలు చేసిన అనంతరం రవాణా, నిల్వ, మిల్లింగ్, డబ్బుల చెల్లింపు వరకు ప్రభుత్వం ప్రతి దశలో సమన్వయంతో పనిచేసింది. రైతుల ఖాతాల్లో రూ.35,537 కోట్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 150 లక్షల కోట్ల టన్నుల ధాన్యం సేకరించగా.. దీనికి గాను రైతుల ఖాతాల్లో
రూ.35,537 కోట్ల డబ్బును జమ చేసింది. 26.43 లక్షల చెల్లింపులను ప్రభుత్వం చేసింది. రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంపై తెలంగాణ ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ఆలస్యంగా చేయడంతో కొందరు రైతులు ప్రైవేటుగా ధాన్యం అమ్ముకున్నారు. ఆ ధాన్యం కూడా దాదాపు ఒక లక్ష టన్నులకు పైగా ఉంటుందని తెలుస్తోంది. అంటే 152 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ ఉత్పత్తి చేసి ఉంటుంది. గతంలో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ వరి ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా ఉండగా.. ఇప్పుడు తెలంగాణ ఆ రెండు రాష్ట్రాలను వెనక్కి నెట్టేసింది.
నీరు, పెట్టుబడి సహాయం వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రభాగంలో ఉండడానికి కారణం అనుసరించిన వ్యూహాలే. తెలంగాణ ఏర్పడిన తొలి నుంచి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై దృష్టి సారించారు. వ్యవసాయ అభివృద్ధికి అన్నీ చర్యలు తీసుకున్నారు. సాగునీటి పారుదల వ్యవస్థను పునరుద్ధరించడమే కాకుండా పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ స్వరూపాన్ని మార్చేసింది. కృష్ణ, గోదావరి నీళ్లను ఒడిసిపట్టుకోవడమే కాకుండా వాన నీటిని కాపాడుకోవడంతో ఆ నీరంతా పొలాలకు మళ్లింది. దీనికితోడు వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించేలా రైతు బంధు పథకం ప్రవేశపెట్టడం తెలంగాణ వ్యవసాయ గతినే మార్చింది. బీడు బడ్డ భూములు కూడా వ్యవసాయ పొలాలుగా మారాయి. యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచడం.. నాణ్యమైన విత్తనాలు అందించడం.. వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో తెలంగాణ వ్యవసాయంలో రారాజుగా నిలుస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేసినట్టు వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తే మరిన్ని అద్భుతాలు తెలంగాణ నమోదు చేస్తుంది.