
జయశంకర్ భూపాలపల్లి :జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వేషాలపల్లి గ్రామంలో కొడారి సమ్మయ్య (65) అనే వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో శనివారం రాత్రి మృతి చెందాడు. సమ్మయ్య గొర్ల కాపరిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి తన గొర్ల మంద వద్ద తలకు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఆస్తికోసం కుమారులు హత్య చేసినట్లు గ్రామస్తులు చెబున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. సమ్మయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి
.