
వారణాసి: ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవు పెట్టారు. ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చుని గావెల్తో (చెక్క సుత్తి) కొడుతూ ‘ఆర్డర్ ఆర్డర్.. విచారణలు ప్రారంభించండి’ అని సూచనలు జారీ చేశారు. ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన న్యాయవాదులు కిందికి దిగాలని ఆమెను ఎంతగా కోరినా ససేమిరా అన్నారు. దగ్గరకు ఎవరూ రావద్దని హెచ్చరించారు. దీంతో కోర్టు హాలులో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. మహిళా పోలీసుల సాయంతో ఆమెను కిందికి దింపి కంటోన్మెంటు ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో వందన మానసిక పరిస్థితి బాగాలేదని గుర్తించి, నగర శివారులోని శివ్పుర్ ప్రాంతానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.