
సాఫీగా సాగుతున్న సమంత (Samantha)జీవితంలో ఒక పెద్ద కుదుపు. వ్యక్తిగత, ఆరోగ్య జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొని, ధైర్యంగా నిలబడి... చివరికి తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంది. సాఫీగా సాగుతున్న సమంత (Samantha)జీవితంలో ఒక పెద్ద కుదుపు. వ్యక్తిగత, ఆరోగ్య జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొని, ధైర్యంగా నిలబడి... చివరికి తనను తాను నూతనంగా ఆవిష్కరించుకుంది. కొంత గ్యాప్ తర్వాత ‘మా ఇంటి బంగారం’తో (Maa inti bangaram) తెరమీదకొస్తున్న సామ్ చెబుతున్న సరికొత్త సంగతులివి... స్టంట్స్ నేనే చేస్తా... ‘మా ఇంటి బంగారం’ సినిమా ట్రైలర్లో నా యాక్షన్ సీన్స్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. సాఫ్ట్‌గా కనిపించే నేను సీరియస్‌గా ఫైట్స్ చేయడం చూసేవాళ్లకు కొత్తగా అనిపించింది. అయితే నా సినిమాలన్నింటిలోనూ ఫైటింగ్ సీక్వెన్స్, స్టంట్స్ నేనే చేస్తా. అందుకోసం నేను బలంగా ఉండాలి. నేను చేసే స్టంట్స్ ప్రేక్షకులకు నమ్మశక్యంగా అనిపించాలి. అందుకే ఫిట్‌గా కనిపించేందుకు ఎక్కువ వర్కవుట్స్ చేస్తా. రాజ్ నాకొక భరోసా ఒక పాత స్నేహితురాలు ‘చాలా కాలం తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉంటున్నావ్. ఊపిరి పీల్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడడం లేదని నాకనిపిస్తోంద’ని వాయిస్ నోట్ పంపింది. అది విన్నాక... రాజ్ నా దగ్గర ఉంటే ఏదైనా మంచే జరుగుతుందనే భరోసా వచ్చింది. బిజినెస్‌తో బిజీ... నటనే కాదు... వ్యాపారంలో కూడా నేను బిజీ. ఫ్యాషన్ లేబుల్ ‘ట్రూలీ స్మా’ను ప్రారంభించిన రెండు నెలల్లోపే.... యాక్టివ్ వేర్ బ్రాండ్ ‘మైల్ కలెక్టివ్’ను ప్రారంభించా. దాంతో పాటు.. క్లీన్ పర్ఫ్యూమ్ బ్రాండ్ ‘సీక్రెట్ ఆల్కెమిస్ట్’ కోసం... యూనిలివర్ వెంచర్స్ ద్వారా సీడ్ ఫండింగ్ రౌండ్లో 3 మిలియన్ డాలర్లను సమీకరించా. అంతే కాదండోయ్.. పికిల్ బాల్ చెన్నై సూపర్ ఛాంప్స్నకూ యజమానిగా వ్యవహరిస్తున్నా. ఆరోగ్యం కోసం తీసుకున్న విరామం కారణంగా రెండున్నరేళ్లుగా ఏ సినిమా విడుదల కాలేదు. ఆ సమయంలో చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టా. అయితే నా మొదటి ప్రాధాన్యత
ఎప్పటికీ నటనే. అనుభవంతో అనేక పాఠాలు... నాకు బాగాలేనప్పుడు... నా భావాలను నోట్ చేయమని డాక్టర్ సలహా ఇచ్చారు. దాంతో మొదటి ఆరునెలలు ‘నాకు నొప్పిగా ఉంది, నేను అలసిపోయాను’ అని మాత్రమే రాసుకున్నా. 2023 నుంచి ‘అంతా మంచే జరుగుతుంది.. ఇది నా సమయం’ అని రాయడం మొదలుపెట్టా. అప్పటి నుంచి సానుకూల విషయాలు మాత్రమే రాయాలని నిర్ణయించుకున్నా. పాజిటివ్‌గా ఉండడం నేర్చుకున్నా. మనం ఏదైతే వ్యక్తపరుస్తామో అదే ఔట్పుట్ వస్తుందని అనుభవం ద్వారా అర్థమైంది.
అన్నీ కలిసే... ఒక రిలేషన్ నుంచి విడిపోయినప్పుడు నేను చాలా కుంగిపోయా. ఇంకెవరిపైనా ఆధారపడడం సాధ్యమవుతుందనుకోలేదు. కానీ నా అంచనా తప్పింది. రాజ్ రూపంలో అదృష్టం కొద్దీ నాకు మంచి ప్రేమ, స్నేహం దొరికాయి. ఈ సరికొత్త బంధం వల్ల బెటర్ అయ్యా. నేనూ రాజ్ కలిసి పనిచేస్తాం, కలిసి ఆడుకుంటాం... కలిసి వ్యాయామం చేయడం మాకు చాలా ఇష్టమైన పని. ఫుడ్ మీద కోరిక లేదు.. ఆటో ఇమ్యూన్ వ్యాధి అయిన మయోసైటిస్‌తో నాలుగేళ్లుగా పోరాడుతున్నా. అందుకే నేను చీట్ మీల్ చేయను. ఎందుకంటే.. నా అనారోగ్య పరిస్థితి వల్ల ఏడాది పాటు ప్రతీరోజూ అవే కూరగాయలు, చికెన్ వంటకాలే తిన్నా. అందుకే ఫుడ్ మీద ఎలాంటి కోరిక కలగడం లేదు. మొండిగా మారాను... ఇండస్ట్రీకి వచ్చి 16 సంవత్సరాలైంది. పొగడ్తలను గానీ, విమర్శలను గానీ సీరియస్‌గా తీసుకోను. అలా తీసుకుంటే మరింత బాధపడాల్సి ఉంటుంది. అందుకే ఇన్నేళ్ల అనుభవంతో నేనొక మొండిదానిలా తయారయ్యాను.