
గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని సరకు రవాణా నౌకపై యూఎస్ జరిపిన దాడిలో ముగ్గురు భారత సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా స్పందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ మండిపడ్డారు. ఇంటర్నెట్ డెస్క్: గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోని సరకు రవాణా నౌకపై యూఎస్ జరిపిన దాడిలో ముగ్గురు భారత సిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అమెరికా స్పందించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ ఎంపీ, విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ మండిపడ్డారు. ఈ అంశంపై యూఎస్, భారత విదేశాంగ శాఖ మంత్రుల ఫోన్ కాల్ అనంతరం అమెరికా విడుదల చేసిన ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్ విషయంలో అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ‘అమెరికా ప్రకటన నన్ను షాక్‌కు గురిచేసింది. భారతీయుల మరణాలపై కనీసం సంఘీభావం కూడా తెలపలేదు. ఒక మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించగలదు’ అని ప్రశ్నించారు. ఒక కమర్షియల్ నౌక నిబంధనలను ఉల్లంఘించిందని భావిస్తే ప్రాణాపాయం జరగని విధంగా నౌకను ఎందుకు అడ్డుకోలేకపోయారని ఎంపీ శశి థరూర్ ప్రశ్నించారు. సిబ్బందికి ప్రాణాపాయం కలిగేలా నేరుగా మిసైల్స్‌ను ప్రయోగించకుండా నౌక ప్రొపల్షన్ సిస్టమ్, లేదా స్టీరింగ్ వ్యవస్థలను ధ్వంసం చేసి ఉండాల్సిందని అన్నారు. మిలిటరీ చర్యల్లో సామాన్య పౌరుల మరణాలు సర్వసాధారణం అన్నట్టు భావించడం ప్రమాదకరమని హెచ్చరించారు. అంతర్జాతీయ జలాల్లోని ప్రతి కమర్షియల్ నౌకలో భారతీయ సిబ్బంది ఉన్న విషయాన్ని పేర్కొన్నారు. అమెరికా చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదని తేల్చి చెప్పారు. ఎర్ర సముద్రంలో యూఎస్ మిలిటరీ సైనిక చర్యల సందర్భంగా భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై కూడా దాడి జరిగింది. లైబీరియా జెండా ఉన్న ఎమ్వీ ఎటర్నిటీ సీ నౌకపై యూఎస్ మిసైల్ దాడి
జరగడంతో ముగ్గురు భారత సిబ్బంది మరణించారు. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ ఫోన్‌కాల్‌పై అమెరికా ఒక ప్రకటన విడుదల చేసింది. హోర్ముజ్‌లోని కమర్షియల్ నౌకలన్నీ అమెరికా నిబంధనలకు కట్టుబడి ఉండాలని మంత్రి మార్కో చెప్పినట్టు వెల్లడించింది. నిబంధనలను అతిక్రమిస్తే అస్సలు సహించమని మంత్రి మార్కో తేల్చి చెప్పినట్టు కూడా వెల్లడించింది.
పిల్లిని కాపాడ్డానికి వెళ్లి.. ఐసీయూలో ప్రాణాలకోసం పోరాటం..